ఆభేరి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో వినిపించే ఒక రాగం. ఇది ఒక జన్య రాగం అనగా, కర్ణాటక సంగీతంలోని72 మేళకర్త రాగాలలో ఒకటి/కొన్ని రాగాల ఆధారంగా పుట్టిన(జననం పొందిన) రాగం. రాగనిధి ప్రకారం ఈ రాగం 20వ మేళకర్త రాగమైన నాటభైరవికి జన్యరాగం. ఈ రాగం హిందుస్తానీ పద్ధతిలోని రాగ్ అభీర్ కు దగ్గరగా ఉంటుండి.[1]
ఆభేరి రాగంలో అందరికీ సుపరిచితమైన కృతి త్యాగరాజు రచించిన "నగుమోము గనలేని". మైసూరు వాసుదేవాచార్య రచించిన భజరే రే మనసా, గోకుల నిలయ కృపాలయ కృతులు ఈ రాగంలో కూర్చినవే. ముద్దుస్వామి దీక్షితులువినభేరి అనే కృతిని ఆభేరి లో రచించినా, అప్పటి ఆభేరికి నేటి ఆభేరికీ వ్యత్యాసం ఉంది.
మల్లీశ్వరి సినిమాలోని "ఆకాశ వీధిలో" పాట ఈ రాగంలో వచ్చినదే.
ఈమాట వెబ్ పత్రికలో కింద తెలిపిన సినిమా పాటల్లో ఆభేరి రాగం వినిపిస్తుందని తెలిపారు:[2]
ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)