ఆయుష్మాన్ భారత్ | |
---|---|
పథకం రకం | హెల్త్ ఇన్సూరెన్స్ |
దేశం | భారతదేశం |
ప్రధానమంత్రి(లు) | నరేంద్ర మోదీ |
మంత్రిత్వ శాఖ | వైద్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ |
ప్రారంభం | 23 సెప్టెంబరు 2018 |
బడ్జెట్ | ₹8,088 crore (US$1.0 billion) (2021–22) [1] |
స్థితి | Active |
వెబ్ సైటు | https://www.pmjay.gov.in/ |
ఆయుష్మాన్ భారత్ ఈ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోదీకేర్‌గా అభివర్ణింస్తారు [2] ఈ పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2018న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు.
ఈ పథకం కింద ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా కల్పింస్తారు. ఈ పథకం వల్ల దాదాపు 10కోట్ల మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతాయి. దీని వల్ల 50కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతారు.
ఈ పథకం కింద సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించనున్నారు. ఇందు కోసం రూ.1200కోట్లను కేటాయించారు. దీని వల్ల ఉపాధి కల్పన, మహిళలకు ఉపాధి కలుగుతుంది.
ఈ పథకం వల్ల భారతదేశ జనాభాలోని 40శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.