ఆర్. వి. ఉదయకుమార్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ |
వృత్తి | దర్శకుడు, నటుడు, గీత రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1988–1996 2005 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుజాత |
ఆర్. వి. ఉదయకుమార్ భారతీయ చలనచిత్ర దర్శకుడు, పాటల రచయిత, నటుడు, ఆయన 1990లలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేశాడు, యెజమాన్ (1993), చిన్న గౌండర్ (1992) వంటి చిత్రాలను నిర్మించాడు.[1][2] కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
ఆయన దర్శకత్వం వహించిన కిజక్కు వాసల్ (1990), చిన్న గౌండర్ (1992) సినిమాలు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ (తృతీయ బహుమతి) అందుకున్నాయి. ఇక తెలుగులో ఆయన తారక రాముడు (1997), మిస్టర్ రాస్కెల్ (2011) చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన పదుల సంఖ్యలో తమిళ చలనచిత్రాలకు పాటలను కూడా రాసాడు.
మెట్టుపాళయం సమీపంలోని మొల్లేపాళయం అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఆర్. వి. ఉదయకుమార్ జన్మించాడు. అతని తండ్రి వెంకటసామి, తల్లి కన్నమ్మాళ్. ఆయన ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి పి. యు.సి పట్టభద్రుడయ్యాడు. కోయంబత్తూరులో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేసాడు. ఆ తరువాత, డైరెక్షన్‌లో డిప్లొమా చేయడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఆ సమయంలో ఆయన పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[3]
ఆయన తన పలు చిత్రాలకు కథ అందించిన సుజాతను వివాహం చేసుకున్నాడు.[4]
చిన్న గౌండర్ (1992) |
పొన్నుమణి (1993) తెలుగులో ముద్దుల బావ |
ఎజమాన్ (1993) |
రాజకుమారన్ (1994) |
చిన్న రామసామి పెరియ రామసామి (2000) – విడుదల కాలేదు |
ఇరు నాధిగల్ (2008) |
సూర్య నగరం (2012) |
పసంగ 2 (2015) తెలుగులో మేము |
అంజల (2016) |
తొడారి (2016) తెలుగులో రైల్ |
దేవి (2016 - బహుభాషా) తెలుగులో అభినేత్రి |
పాంభు సత్తాయ్ (2017) |
కెలంబితంగయ కెళంబితంగయ (2018) |
100% కాదల్ (2019) |
ఇది కథాయిల్లా నిజం (2023) |
కారుమేగంగల్ కలైగింద్రణ (2023) |