ఆర్.ఆర్.వెంకట్ | |
---|---|
జననం | జె.వి. వెంకట్ ఫణీంద్రా రెడ్డి 1966/1967 ఇండియా |
వృత్తి | సినీ నిర్మాత, సిట్రిబ్యూటర్, సామజిక సేవకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004 - 2021 |
ఆర్.ఆర్.వెంకట్ తెలుగు సినిమా నిర్మాత. ఆయన పూర్తి పేరు జె.వి. వెంకట్ ఫణీంద్రా రెడ్డి. వెంకట్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్ , డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించి, అనేక సినిమాలను డిస్టిబ్యూషన్ చేసి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు నిర్మించాడు. వెంకట్ 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
ఆర్ఆర్ వెంకట్ హిందీలో 2004లో ఏక్ హసీనా తి, 2012లో 'డివోర్స్ ఇన్విటేషన్' ఇంగ్లీష్ సినిమాను నిర్మించాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన తెలుగులో ఆహ్వనం పేరుతో రిలీజ్ అయిన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో రీమేక్ చేశాడు.
వెంకట్ కొన్ని రోజులుగా కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో 27 సెప్టెంబర్ 2021న మరణించాడు.[1][2][3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)