ఆర్.ఎన్.సుదర్శన్ | |
---|---|
![]() | |
జననం | రట్టిహల్లి నాగేంద్ర సుదర్శన్ 1939 మే 2 కర్నాటక బ్రిటిష్ ఇండియా. |
మరణం | 8 సెప్టెంబరు 2017 బెంగళూరు, కర్ణాటక | (aged 78)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, గాయకుడు, సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1961–2017 |
జీవిత భాగస్వామి | శైలశ్రీ |
పిల్లలు | ఆర్. అరుణ్ కుమార్ |
తల్లిదండ్రులు | ఆర్.నాగేంద్రరావు రత్నాబాయి |
కుటుంబం | ఆర్.ఎన్.కృష్ణప్రసాద్ (సోదరుడు) ఆర్.ఎన్.జయగోపాల్ (సోదరుడు) |
రట్టి నాగేంద్ర సుదర్శన్ (1939 మే 2 – 2017 సెప్టెంబరు 8) భారతీయ సినిమా నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా కన్నడ సినిమాలలో తన సేవలనందించాడు. తమిళం, హిందీ, తెలుగు, మలయాళ సినిమాలలో కూడా నటించాడు.[1] మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సినీ జీవితంలో 250 లకు పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.[2]
సుదర్శన్, ప్రముఖ సినిమా దర్శకుడైన ఆర్. నాగేంద్రరావు కుమారుడు. అతని సోదరులలో -ఆర్.ఎన్.జయగోపాల్ (మరణం.2005) ప్రముఖ సినీ గీత రచయిత, ఆర్.ఎన్.ప్రసాద్ (మరణం.2008) ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అతని భార్య "శైలశ్రీ".[3]
1961లో ఆయన తన 21వ యేట కన్నడ చిత్రంలో నటునిగా రంగప్రవేశం చేసారు. ఆయన తొలి చిత్రం "విజయనగర వీరపుత్ర". ఆయన సినిమాలలో ప్రతినాయకుని పాత్రలలో నటించడానికి పూర్వమే 60 సినిమాలలో వివిధ పాత్రలలో నటించారు.[4]
ఆయన కన్నడం లోని "అగ్నిశశి" డైలీ సీరియల్ లో నటించాడు.
ఆయన కొన్ని చిత్రాలలో పాటలను కూడా పాడారు.
ఆర్.ఎన్.సుదర్శన్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
ఆయన కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017, సెప్టెంబరు 8 శుక్రవారంనాడు మరణించాడు.[5]