ఆర్.బాలకృష్ణ పిళ్లై | |||
![]()
| |||
రవాణా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 10 మార్చి 2003 – 29 ఆగస్టు 2004 | |||
పదవీ కాలం 22 మార్చి 1995 – 28 జూలై 1995 | |||
పదవీ కాలం 24 జూన్ 1991 – 16 మార్చి 1995 | |||
పదవీ కాలం 26 డిసెంబరు 1975 – 25 జూన్ 1976 | |||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 25 మే 1986 – 25 మార్చి 1987 | |||
పదవీ కాలం 24 మే 1982 – 5 జూన్ 1985 | |||
పదవీ కాలం 25 జనవరి 1980 – 20 అక్టోబర్ 1981 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1971 – 1977 | |||
ముందు | జి.పి. మంగళతుమాడోమ్ | ||
---|---|---|---|
తరువాత | బి.కె. నాయర్ | ||
నియోజకవర్గం | మావేలికర | ||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 25 మార్చి 1977 – 12 మే 2006 | |||
ముందు | కొట్టార గోపాలకృష్ణన్ | ||
తరువాత | పి. ఐషా పొట్టి | ||
నియోజకవర్గం | కొట్టారకర | ||
పదవీ కాలం 1960 – 1965 | |||
ముందు | ఎన్. రాజగోపాలన్ నాయర్ | ||
తరువాత | పీకే రాఘవన్ | ||
Constituency | పటనాపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వాలాకోమ్, కొట్టారక్కర, ట్రావెన్కోర్ | 1934 ఏప్రిల్ 3||
మరణం | 3 మే 2021 కొట్టారకర, కొల్లం, కేరళ, భారతదేశం | (aged 87)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
| ||
తల్లిదండ్రులు | కీజూట్టు రామన్ పిళ్లై, కార్తియాని అమ్మ[1] | ||
జీవిత భాగస్వామి | వత్సల | ||
సంతానం | 3 | ||
నివాసం | కీజూట్టు పుతేన్ వీడు, వలకోమ్, కొట్టరకరా, కొల్లం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కీజూటే రామన్ బాలకృష్ణ పిళ్లై (8 మార్చి 1935 - 3 మే 2021) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1960లో పటనాపురం నియోజకవర్గం నుండి ఒక్కసారి, కొట్టారక్కర శాసనసభ నియోజకవర్గం నుండి 1965, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001 ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 1971లో లోక్‌సభ సభ్యుడిగా, 1980 - 1982, 1982 -1985 & 1986 -1987, 1991 -1995, 2001 - 2004 వరకు మంత్రిగా పని చేశాడు.[1][2]
ఆర్ బాలకృష్ణ పిళ్లై విద్యార్థి దశలోనే స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరి, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1960లో పటనాపురం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1958 నుంచి 1964 వరకు ఏఐసీసీ సభ్యుడిగా పని చేసి ఆ తరువాత 25 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌ను వీడి పిళ్లై 1964లో కేఎం జార్జ్‌తో కలిసి కేరళ కాంగ్రెస్ (బీ)ని స్థాపించాడు. ఆయన 1965లో కేరళ కాంగ్రెస్ (బీ) నుండి కొట్టారకర నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 1967 & 1970లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.
ఆర్ బాలకృష్ణ పిళ్లై 1971లో మావేలికర నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆర్ బాలకృష్ణ పిళ్లై 1977లో ఎమ్మెల్యేగా ఎన్నికై డిసెంబర్ 1975 నుండి జూన్ 1976 వరకు కేరళ మంత్రివర్గంలో రవాణా, ఎక్సైజ్ & జైళ్ల మంత్రిగా, 1982 నుండి 1985 వరకు కె కరుణాకరన్ మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.
2008 నవంబరులో కేరళ కాంగ్రెస్ (మణి), కేరళ కాంగ్రెస్ (బాలకృష్ణ పిళ్లై), కేరళ కాంగ్రెస్ (జాకబ్), కేరళ కాంగ్రెస్ (సెక్యులర్) రాజకీయ పార్టీలతో కూడిన ఐక్య కేరళ కాంగ్రెస్ కూటమికి ఆర్.బాలకృష్ణ పిళ్లై కన్వీనర్‌గా ఉన్నాడు.
పిళ్లై 2017 నుండి 3 మే 2021 వరకు కేబినెట్ ర్యాంక్‌తో కేరళ స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఫర్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ చైర్మన్‌గా పని చేశాడు.
కె కరుణాకరన్ మంత్రివర్గంలో 1982-1985 మధ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇడమలయార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు విషయంలో తమ పదవులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిళ్లై తో సహా మరో ఇద్దరికి ఫిబ్రవరి 2011లో సుప్రీంకోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.[3][4]
ఆర్.బాలకృష్ణ పిళ్లై వృద్ధాప్య అస్వస్థతతో కొట్టారక్కరాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2021 మే 3న మరణించాడు. ఆయనను కొట్టారక్కరలోని అతని స్వగృహంలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహాన్ని దహనం చేశారు. ఆయనకుఒక కుమారుడు పిల్లలు ఉష మరియు బిందు అనే ఇద్దరు కుమార్తెలు మరియు అతని ఏకైక కుమారుడు కె.బి. గణేష్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉష, బిందు ఉన్నారు.[5][6][7]