ఆలమట్టి ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | బీజాపూర్ జిల్లా, కర్ణాటక |
అక్షాంశ,రేఖాంశాలు | 16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E |
ప్రారంభ తేదీ | జూలై 2006 |
నిర్మాణ వ్యయం | ₹5.20 billion |
నిర్వాహకులు | కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
Height | 524.26 అడుగులు |
పొడవు | 1565.15 అడుగులు |
జలాశయం | |
పరీవాహక ప్రాంతం | 33,375 చదరపు కిలోమీటర్లు |
ఉపరితల వైశాల్యం | 24,230 హెక్టార్లు |
లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా పిలుస్తారు.ఈ ప్రాజెక్టు కృష్ణా నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2001న శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటి లభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీ లు.
ఆలమట్టి ఆనకట్ట బీజాపూర్ జిల్లా, కర్ణాటక నిర్మించారు. అలమట్టి నుండి 1 కి.మీ.లో ఈ అలమట్టి ఆనకట్ట ఉంది. ఈ జలాశయం సముద్ర మట్టానికి 1705.3272 అడుగులలో కృష్ణ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టుని అప్పటి భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఎపిజె అబ్దుల్ కలాం ప్రారంభించారు.[1] ఈ ప్రాజెక్టు విజయపుర నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది.రైలులో సుమారు 1 గంట 10 నిమిషాలు పడుతుంది.[2]
519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం,కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటన చేసింది.ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి అని దీనిని వ్యతిరేకించారు.[3]
ఏడు అంతస్తుల తోటలను ఆనకట్ట ప్రాంతంలో పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారు. ఆనకట్ట ప్రాంతంలో పడవలు, సంగీత ఫౌంటైన్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఆనకట్ట ఒక భాగంలో, "రాక్ హిల్" అనే పార్క్ ఉంది. భారతదేశంలో వన్యప్రాణులు, పక్షులు, గ్రామ జీవితాలను సూచించే అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారు.