ఆలస్యం అమృతం (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్రమహేష్ |
---|---|
నిర్మాణం | దగ్గుబాటి రామానాయుడు |
కథ | ఎస్. పృథ్వీతేజ |
చిత్రానువాదం | చంద్రమహేష్ |
తారాగణం | నిఖిల్ సిద్ధార్థ్, మదాలస శర్మ |
సంగీతం | కోటి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | పూర్ణ కాండ్రు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 డిసెంబరు 2010[1] |
నిడివి | 119 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆలస్యం అమృతం 2010, డిసెంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సారథ్యంలో చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, మదాలస శర్మ జంటగా నటించగా, కోటి సంగీతం అందించాడు.[2]
ఉత్తమ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నంది పురస్కారం.
రామ్ (నిఖిల్) కు యు.ఎస్.ఏ.లో ఉద్యోగం వస్తుంది. అన్నవరం గుడికి వెళ్ళి మొక్కు చెల్లించి హైదరాబాదు వెళ్ళడానికి రైల్వే స్టేషనుకు వస్తాడు. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్ళి చేస్తుండడంతో ఇంటినుండి వచ్చేసిన వైదేహి (మదలసా శర్మ) ను అక్కడ కలుస్తాడు. స్టేషన్‌లో నెల వయసున్న బాబును రామ్, వైదేహి చూస్తారు. ఆ బాబు తల్లిదండ్రులను కనుగొనడానికి వాళ్ళిద్దరూ చేసే ప్రయత్నమే మిగతా కథ.[3][4]
ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[5]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)