ఆలీబాబా అరడజను దొంగలు | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
రచన | మరుధూరి రాజా (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఇ.వి.వి. సత్యనారాయణ |
కథ | ఇ.వి.వి. సత్యనారాయణ బలభద్రపాత్రుని రమణి |
నిర్మాత | కె. చిన్ని |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రవళి, శ్రీకన్య |
ఛాయాగ్రహణం | బాబ్జీ |
కూర్పు | నాయని మహేశ్వర రావు |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | మెలోడి మూవీస్[1] |
విడుదల తేదీ | 12 ఆగస్టు 1994 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆలీబాబా అరడజనుదొంగలు 1994, ఆగస్లు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మెలోడి మూవీస్[2] పతాకంపై కె. చిన్ని నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి. సత్యనారాయణ[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రవళి, శ్రీకన్య నటించగా,[4] విద్యాసాగర్[5] సంగీతం అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[6]
పోలీసు అలీబాబా (రాజేంద్ర ప్రసాద్) 6మంది చిన్న దొంగలు కోటయ్య అండ్ కో (కోట శ్రీనివాసరావు, అలీ, మల్లికార్జున రావు), బ్రహ్మమ్ బ్రదర్స్ (బ్రాహ్మానందం, రాళ్ళపల్లి, చిడతల అప్పరావు) అనే రెండు వేర్వేరు ముఠాలకు సంబంధించిన కథ. ఈ రెండు ముఠాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి, వారి దొంగతనాలతో నగరంలో గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయి. వారిని పట్టుకోవడానికి అలీబాబాను ప్రత్యేకంగా నియమిస్తారు. ఈ రెండు ముఠాలకు ఇద్దరు సోదరీమణులు పులన్ దేవి (రవళి), పూజా బేడి (శ్రీకన్య) ఉంటారు. 6మంది దొంగలు కుట్ర పన్ని, అలీబాబాను పక్కతోవ పట్టించి తమ చెల్లెల్లను ఇచ్చి వివాహం చేస్తారు. అలీబాబా తన ఇద్దరు భార్యలు, 6మంది బావమరుదులతో ఎలాంటి బాధలు పడ్డాడు, వాటినుండి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.
ఆలీబాబా అరడజను దొంగలు | ||||
---|---|---|---|---|
సినిమా by విద్యాసాగర్ | ||||
Released | 1994 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 28:45 | |||
Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
Producer | విద్యాసాగర్ | |||
విద్యాసాగర్ chronology | ||||
|
ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బాబా బాబా ఆలీబాబా (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 5:20 |
2. | "నీ పేరే నా ప్రేమ (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:02 |
3. | "ఎర్ర బుగ్గలు చూసుకో (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:07 |
4. | "కస్సు కస్సుమన్నది (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:21 |
5. | "రంభ నాకు పెద్దపాప (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | చిత్ర, మాల్గాడి శుభ | 4:56 |
6. | "నీ పైట జారిపోతే (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో | 4:59 |
మొత్తం నిడివి: | 28:45 |
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా "ఇవివి సూపర్-హిట్ కామెడీ, వినోదాత్మక చిత్రాలలో ఒకటి"గా పేర్కొంది.[8]