ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
---|---|
నాయకుడు | బద్రుద్దీన్ అజ్మల్ |
స్థాపన తేదీ | 2 అక్టోబరు 2005 |
ప్రధాన కార్యాలయం | నెం.3 ఫ్రెండ్స్ పాత్, హతిగావ్, గౌహతి-781038 |
రాజకీయ విధానం | సామాజిక న్యాయం[1] మైనారిటీ హక్కులు[1] |
ఈసిఐ హోదా | రాష్ట్ర పార్టీ[2] |
కూటమి | యుపిఎ (2019–2021) |
లోక్‌సభలో సీట్లు | 1 / 543 |
రాజ్యసభలో సీట్లు | 0 / 245 |
శాసనసభలో సీట్లు | 15 / 126 |
Election symbol | |
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సర్వ భారతీయ సంయుక్త గణతంత్రిక మోర్చా) అనేది అస్సాంలోని క్రియాశీలంగా ఉన్న రాజకీయ పార్టీ.[3] అస్సాం శాసనసభలో బిజెపి, కాంగ్రెస్ తర్వాత ఇది 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ.
పార్టీని 2005, అక్టోబరు 3 న మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించాడు, ఆ సమయంలో దాని పేరు అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉండేది. 2009, ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో ప్రెస్ మీట్‌లో దాని ప్రస్తుత పేరుతో జాతీయ పార్టీగా పునఃప్రారంభించబడింది, మళ్లీ బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. పార్టీ ప్రధాన కార్యాలయం గౌహతిలో ఉంది.[4][5]
అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కీలకమైన ప్రతిపక్ష పార్టీ. ఇది దిగువ అస్సాం, బరాక్ వ్యాలీ నుండి మిలియన్ల కొద్దీ మియా బెంగాలీ ముస్లింల వాయిస్. 2011 శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 18 గెలుచుకుంది;[6] 2016లో, 126 సీట్లలో 13 గెలుచుకుంది. 2021లో, అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బిపిఎఫ్, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన సంఖ్యను పెంచుకుంది. 2021 అస్సాం శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 16 గెలుచుకుంది.[7] అయితే, దాని కూటమి మహాజోత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీని పొందలేకపోయింది.
సంవత్సరం | ఎన్నికల | గెలిచిన సీట్లు | సీట్ల మార్పు | ఓటు% | ఓటు మార్పు% |
---|---|---|---|---|---|
2006 | 12వ అసెంబ్లీ (అస్సాం) | 10 / 126
|
– | - | |
2009 | 15వ లోక్‌సభ | 1 / 14
|
– | 16.3% | |
2011 | 13వ అసెంబ్లీ (అస్సాం) | 18 / 126
|
8 | 13% | |
2014 | 16వ లోక్‌సభ | 3 / 14
|
2 | 14.8% | 2.5% |
2016 | 14వ అసెంబ్లీ (అస్సాం) | 13 / 126
|
5 | 13% | |
2019 | 17వ లోక్‌సభ | 1 / 14
|
2 | 7.8% | 7% |
2021 | 15వ అసెంబ్లీ (అస్సాం) | 16 / 126
|
3 | 9.3% | 4.3% |