రకం | అనుబంధ సంస్థ |
---|---|
పరిశ్రమ | వినోదం, మాస్ మీడియా |
శైలి | OTT ప్లాట్‌ఫారమ్ (ఓవర్-ది-టాప్ మీడియా సర్వీస్) |
స్థాపన | 2017 |
స్థాపకుడు | ఏక్తా కపూర్ |
ప్రధాన కార్యాలయం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
కీలక వ్యక్తులు | శోభా కపూర్ (మేనేజింగ్ డైరెక్టర్, బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్) ఏక్తా కపూర్ (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్) |
ఉత్పత్తులు | ప్రజ్వల్ కౌశిక్ |
సేవలు |
|
యజమాని | బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ |
వెబ్‌సైట్ | altbalaji![]() |
ఆల్ట్ బాలాజీ (ఆంగ్లం: ALTBalaji) అనేది భారతీయ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫారమ్. ఇది బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.[1][2][3] డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అసలైన OTT కంటెంట్‌ని రూపొందించడానికి ఆల్ట్ బాలాజీ ముంబై నగరంలో ప్రధాన కేంద్రంగా 2017 ఏప్రిల్ 16న ప్రారంభించబడినది.[4][5]
ఫార్చూన్ ఇండియాలో 2020 వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ డైరెక్టర్ ఎక్తా కపూర్ ఒకరిగా చోటు దక్కింది. దీనికి కారణం ఆమె నాయకత్వంలో ప్రైమ్ టైమ్ వ్యూయిర్ షిప్ 18శాతం షేర్ దక్కించుకుని, మొత్తంగా OTT ప్లాట్ ఫాంపై ఆదాయం 77 కోట్లకు చేరడమే. కాగా 2012లోనూ ఆమె ఫోర్భ్స్ ఏసియాలో శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కళల రంగంలో ఏక్తా కపూర్ చేసిన కృషికి 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.[6]
ప్రపంచంలోని వివిధ మూలల్లో భారతీయ సీరియల్‌లు, వినోద కార్యక్రమాలను చూడలేని విదేశీ భారతీయులందరికి చేరవేయడమే ఆల్ట్ బాలాజీ ప్రధాన లక్ష్యం. కాగా వీక్షకులకు 32 విభిన్న ఇంటర్‌ఫేస్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఈ కంటెంట్ మొబైల్, టాబ్లెట్ పరికరాలలో (యాపిల్ ఫోన్, యాపిల్ ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్), వెబ్ బ్రౌజర్ (డెస్క్‌టాప్ బ్రౌజర్), ఆండ్రాయిడ్ టీవీ, విండోస్ (విండోస్ పిసి, విండోస్ మొబైల్, విండోస్ టాబ్లెట్)లో అందుబాటులో ఉంది.[7]
2022లో ఆల్ట్ బాలాజీ నాలుగు షోలను మాత్రమే విడుదల చేసింది, అవి లాక్ ఉప్ (సీజన్ 1), పవిత్ర రిష్తా (సీజన్ 2), అపరన్ (వెబ్ సిరీస్) (సీజన్ 2), కోడ్ ఎం (సీజన్ 2). ప్రస్తుతం డ్రామా, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ వంటి కథల శైలితో OTT కంటెంట్ బ్యాంక్‌లో భారతదేశంలోని అగ్ర నటులు, దర్శకులు ఉన్నారు. కంటెంట్ బ్యాంక్‌లో 100+ గంటల పిల్లల కంటెంట్ అలాగే బెంగాలీ, హిందీ, మరాఠీ, పంజాబీ, తమిళం.. ఇలా అనేక ఇతర భాషలలో పట్టణ ప్రాంతీయ షోలు ఉన్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే విడుదలైన సంవత్సరం, వ్యవధి, స్టార్ తారాగణం, భాష, జానర్ వివరాలతో కూడిన బాలీవుడ్ హిట్‌లు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో జాన్ అబ్రహం, సన్నీ లియోన్, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ హష్మీ మొదలైన ప్రముఖ బాలీవుడ్ నటుల హిట్‌లు ఉన్నాయి.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)