వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పోర్ట్ ఎలిజబెత్, కేప్ కాలనీ | 1868 ఫిబ్రవరి 16|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1946 నవంబరు 22 తూర్పు లండన్, దక్షిణాఫ్రికా | (వయసు 78)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 7) | 1889 12 March - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1889 25 March - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 10 March |
ఆల్బర్ట్ రోజ్-ఇన్నెస్ (1868, ఫిబ్రవరి 16 - 1946, నవంబరు 22) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు.
స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ గా, బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌కు ఫస్ట్-క్లాస్ హోదా రాకముందు 1886–87 కింబర్లీ టోర్నమెంట్, 1887–88 ఛాంపియన్ బ్యాట్ టోర్నమెంట్‌లో పోర్ట్ ఎలిజబెత్ జట్టు తరపున ఆడాడు.[1] 1887-88 పోటీలో గ్రాహంస్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 వికెట్లు తీశాడు.[2]
ఒక మ్యాచ్‌లో రోజ్-ఇన్నెస్ బ్యాటింగ్ ప్రారంభించి 0, 13 పరుగులు చేయడంతోపాటు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 43 పరుగులకు 5 వికెట్లు తీశాడు.[3] రెండు వారాల తర్వాత కేప్ టౌన్‌లో ఆడిన రెండవ టెస్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బ్రిగ్స్ ఒక ఇన్నింగ్స్‌లో 11 పరుగులకు 8 వికెట్లు, ఒక మ్యాచ్‌లో 28 పరుగులకు 15 వికెట్ల రికార్డును సృష్టించడంతో, దక్షిణాఫ్రికా ఒక ఇన్నింగ్స్, 202 పరుగులతో సమగ్రంగా ఓడిపోయి తమ మొదటి టెస్ట్ సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. రోజ్-ఇన్నెస్ మళ్ళీ బ్యాటింగ్ ప్రారంభించి ఈసారి 1, రెండో ఇన్నింగ్స్‌లో బంతిని ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు.[4][5]