ఆశా దేవి ఆర్యనాయకం | |
---|---|
జననం | 1901 లాహోర్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1972 (aged 70–71) |
భార్య / భర్త | ఇ. ఆర్. డబ్ల్యు. అరణ్యకం |
తల్లిదండ్రులు | ఫణిభూషణ్ అధికారి సర్జుబాలా దేవి |
పురస్కారాలు | పద్మశ్రీ (1954) |
ఆశా దేవి ఆర్యనాయకం (1901-1972) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, విద్యావేత్త, గాంధీవాది.[1][2][3] మహాత్మా గాంధీ సేవాగ్రామ్‌తోనూ, వినోబా భావే నడిపిన భూదానోద్యమంతోనూ ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది.[4][5]
1901లో బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పాకిస్తాన్)లోని లాహోర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫణి భూషణ్ అధికారి, సర్జుబాలా దేవి దంపతులకు ఆమె జన్మించింది. ఆమె బాల్యం లాహోర్‌లోనూ, తరువాత వారణాసిలోనూ గడచింది. ఆమె తన పాఠశాల విద్యనూ, కళాశాల విద్యనూ ఇంట్లోనే కొనసాగించి ఎం.ఏ. పట్టాను సంపాదించింది.
చదువు పూర్తిచేసుకున్నాకా ఆశా దేవి వారణాసిలోని మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. తరువాత, ఆమె శాంతినికేతన్‌లో చేరి, అక్కడి బాలికలను చూసుకునే బాధ్యతను చేపట్టింది. శాంతినికేతన్‌లో చేరాకా రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన ఇ. ఆర్. డబ్ల్యూ. అరణ్యకాన్ని కలసింది, తర్వాత అతన్ని వివాహం చేసుకుంది.[2][3] ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలిగారు.
ఈ దశలోనే ఆమె మహాత్మా గాంధీ ఆలోచనలకు, కృషికి ప్రభావితురాలైందిజ ఆమె తన భర్తతో కలిసి వార్ధాలోని సేవాగ్రామ్‌లో చేరింది. అక్కడ చేరినాకా మొదట్లో ఆమె మార్వాడి విద్యాలయలో పనిచేస్తూ వచ్చింది, కానీ తరువాత మహాత్మా గాంధీ ఆలోచన విధానంలో రూపుదిద్దుకున్న కొత్త తరహా విద్యా వ్యవస్థ అయిన నయీ తాలిమ్ ఆదర్శాలను స్వీకరించి, హిందుస్థానీ తాలిమీ సంఘ్‌లో పనిచేసింది.[2][3]
ఆశా దేవి ఆరణ్యకమ్ రెండు పుస్తకాలను రాసింది. అవి - ద టీచర్: గాంధీ, శాంతి సేన అన్నవి. ఈ రెండూ మహాత్మా గాంధీ ఆలోచనలకు సంబంధించినవే.[6][7] ఆమె 1972 లో మరణించింది.[1]
1954లో భారత ప్రభుత్వం ఆమె చేసిన సమాజ సేవకు గాను భారతదేశ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. 1954లోనే పద్మ పురస్కారాలు ఇవ్వడంతో ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఆమె ఒకరు.[8] అలాగే, ఆమె పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి మహిళ కూడా.[9]
<ref>
ట్యాగు; "The City of Hope: The Faridabad Story" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
<ref>
ట్యాగు; "An Atlas of Tribal India" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు