ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | |||
![]()
| |||
మాజీ తెలంగాణ గవర్నర్
| |||
పదవీ కాలం డిసెంబరు 28, 2009- సెప్టెంబర్ 1, 2019 | |||
ముందు | నారాయణదత్ తివారీ | ||
---|---|---|---|
తరువాత | తమిలాసాయి సౌందర్రాజన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జీవిత భాగస్వామి | విమల | ||
నివాసం | హైదరాబాదు తెలంగాణ | ||
మతం | హిందూ |
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (ఈక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివారు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేశారు. ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి, 2009 డిసెంబరు 28న న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2010 జనవరి 22 న పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు మాజీ గవర్నరు.[1]