ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,1996 లోశ్రీ దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు.దగ్గుబాటివెంకటేష్,సౌందర్య, వినీత ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కోటి సమకూర్చారు .
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
నిర్మాణం | కె.ఎల్. నారాయణ |
తారాగణం | వెంకటేష్, సౌందర్య, వినీత, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, కాశ్మీర షా [1][2] The film was successful at the box office.[3] |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ దుర్గా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
వెంకటేష్, సౌందర్యలకు పిల్లలు కలుగరు. సౌందర్యలో ఉన్న లోపాన్ని కప్పిపెట్టి వెంకటేష్ సర్దుకు వస్తుంటాడు. ఒకమారు వెంకటేష్ నేపాల్ కు వెళ్ళినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆమెకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడు. ఆ పిల్లవాడినే వెంకటేష్ దత్తతకు ఇంటికి తెస్తాడు. కాని వెంకటేష్ తండ్రి కోట శ్రీనివాసరావుకు అసలు సంగతి తెలిసి ఆ నేపాలి అమ్మాయి(వినీత)ని తన వూరికి తెస్తాడు. ఆ అమ్మాయే వంట మనిషిగా వెంకటేష్, సౌందర్యల వద్ద చేరుతుంది. ఇక కథ ఇంకా అనేక మలుపులు తిరుగుతుంది.[4]
పాటల రచయిత: సామవేదం షణ్ముఖశర్మ
దర్శకుడు: ఇ . వి.వి సత్యనారాయణ
నిర్మాణ సంస్థ: శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత: కె.ఎల్.నారాయణ
కథ: కె.భాగ్యరాజా
మాటలు: ఇసుకపల్లి మోహన రావు
పాటలు: సామవేదం షణ్ముఖశర్మ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో, సుజాత, సంగీత
సంగీతం: కోటి
సమర్పణ,ఫోటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి
డ్యాన్స్: తారాప్రసాద్
ఆర్ట్: అశోక్ కుమార్
విడుదల:1996 మే 23 .
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)