ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనకోడి రామకృష్ణ (కథ, స్క్రీన్ ప్లే)
గొల్లపూడి మారుతీరావు (సంభాషణలు)
నిర్మాతకె.రాఘవ
తారాగణంచిరంజీవి,
మాధవి,
పూర్ణిమ
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఏప్రిల్ 23, 1982 (1982-04-23)[1]
సినిమా నిడివి
2 గంటల 15 నిమిషాలు
భాషతెలుగు

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు.[2] ఇది దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలిచిత్రం.[2] ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించాడు.

1982 ఏప్రిల్ 22 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. దీన్నే తమిళంలో శివకుమార్, రాధిక, సుహాసినిలతో వీటుల రామన్ వెలియిల కృష్ణన్ పేరుతోనూ, కన్నడంలోఅంబరీష్, శ్రీప్రియ, ముఖ్యమంత్రి చంద్రు మొదలైనవారితో మనెలి రామణ్ణ బీధీలి కామణ్ణ (1983), హిందీలో గోవిందా, నీలమ్, అనుపమ్ ఖేర్, రీటా భాదురి తదితర తారాగణంతో ఘర్ మే రాం గలీ మే శ్యామ్ పేరుతో పునర్నిర్మాణం చేశారు.[2]

రాజశేఖరం ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు జయలక్ష్మి మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ.

తారాగణం

[మార్చు]

ఫలితం

[మార్చు]

ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.[1]

పాటలు

[మార్చు]
పాట పాడినవారు రచన
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బాలు సి, నారాయణ రెడ్డి
ఒక వనిత నవ ముదిత బాలు సి. నారాయణ రెడ్డి
వచ్చే వచ్చే వయసు జల్లు బాలు, పి.సుశీల సి. నారాయణ రెడ్డి
స్వామి శరణం అయ్యప్ప ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం సి. నారాయణ రెడ్డి
సీతారాముల ఆదర్శం బాలు సి. నారాయణ రెడ్డి
పలికేది వేద మంత్రం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల సి. నారాయణ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "38 సంవత్సరాల 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య". సితార. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. 2.0 2.1 2.2 శ్రీ, అట్లూరి. "Intlo Ramayya Veedhilo Krishnayya (1982)". telugucinema.com. Archived from the original on 2007-01-04. Retrieved 18 అక్టోబరు 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]