ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్ ( IIM-I అని కూడా పిలుస్తారు) అన్నది ఒక ప్రభుత్వ స్వయంపాలక మేనేజ్‌మెంట్ కళాశాల. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణంలో ఉంది. ప్రఖ్యాత గాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కుటుంబంలోని ఆరోవది,[1] మరి 1996 లో స్దాపించడమైనది. ఇది భారతదేశంలోని అసోసియెషన్ ఆఫ్ ఎం.బీ.ఏ (AMBA)[2] గుర్తింపు కలిగిన అతికొద్ది విద్యాసంస్ధలలో ఒకటి. మానవ వనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన NIRF 2017 ర్యాంకుల ప్రకారం ఐ.ఐ.ఎం ఇండోర్ మొదటి పది స్ఢానాలలోనే[3] ఉంది, మరి Business Today పత్రిక వారి 2016 ర్యాంకులలోనూ అదే స్థాయిలో[4] నిలబడింది
క్యాంపస్ ప్రాంగణం ఇండోర్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో, రావు అనే గ్రామానికి సమీపంలో ఉంది. క్యాంపస్ లో విద్యార్ధుల వసతి కోసం 18 హాస్టల్స్[12] ఉన్నాయి, అధ్యాపకులు కూడా వారి కుటుంబాలతో కలిసి క్యాంపస్ లోనే ఉంటారు. విద్యార్ధుల కోసం లైబ్రరీ, జిం, ఈత కొలను, మైదానాలు ఉన్నాయి. లైబ్రరీ లో సుమారు 15000 పైగా పుస్తకాలు ఉన్నాయి, సంవత్సరంలో మూడు రోజుల మినహా అన్నీ రోజులూ పని చేస్తుంది. [13]