ఇతర పేర్లు | IDSN | ||||||
---|---|---|---|---|---|---|---|
సంస్థ | ఇస్రో | ||||||
స్థానం | బ్యాలాలు, రామనగర జిల్లా, కర్ణాటక | ||||||
నిర్దేశాంకాలు | 12°54′06″N 77°22′05″E / 12.901767°N 77.36819°E | ||||||
స్థాపన | 2008 అక్టోబరు 17 | ||||||
వెబ్‌సైటు | [1] | ||||||
Telescopes | |||||||
| |||||||
ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (IDSN) అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న పెద్ద యాంటెనాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలతో కూడిన నెట్‌వర్కు. ఇది భారతదేశపు గ్రహాంతర అంతరిక్ష యాత్రలకు మద్దతు ఇస్తుంది. ఇది కర్ణాటక లోని బ్యాలాలు, రామనగర్‌లో ఉంది. దీనిని 2008 అక్టోబరు 17 న మాజీ ఇస్రో ఛైర్మన్ జి. మాధవన్ నాయర్ ప్రారంభించాడు.
ఇలాంటి నెట్‌వర్కులను అమెరికా, చైనా, రష్యా, యూరప్, జపాన్‌లు నిర్వహిస్తున్నాయి.
ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) ఈ నెట్‌వర్కులో భాగం. ఇందులో కావాల్సిన విధంగా స్టీరింగు చేసుకోగల 18 మీ. (59 అ.) యాంటెన్నా ఉంది. 32 మీ. (105 అ.) DSN యాంటెన్నా కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికే ఉన్న ISTRAC సిస్టమ్‌తో పోల్చినప్పుడు ఇది విజిబిలిటీ పరిధిని విస్తృతపరుస్తుంది. భారతీయ డీప్ స్పేస్ నెట్‌వర్కు, కన్సల్టేటివ్ కమిటీ ఫర్ స్పేస్ డేటా సిస్టమ్స్ (CCSDS) ప్రమాణాలకు కట్టుబడిన బేస్‌బ్యాండ్ సిస్టమ్‌ను అమలు చేస్తుంది. తద్వారా టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ (TTC) ఏజెన్సీల మధ్య మెరుగైన పరస్పర సహకారాన్ని ఏర్పరుస్తుంది. [1]
బైలాలు కాంప్లెక్స్‌లోని రెండు యాంటెనాల్లో అంతర్నిర్మిత సహాయక సౌకర్యాలు ఉన్నాయి. ఫైబర్ ఆప్టిక్ లింక్ DSN స్టేషను SCC/NCC/ISSDC ల మధ్య అవసరమైన సమాచార లింకును అందిస్తుంది. 18 మీటర్ల యాంటెన్నా S బ్యాండ్‌లో రెండు డౌన్‌లింక్ క్యారియర్‌లను, X బ్యాండ్ ( RCP, LCP )లో రెండు క్యారియర్‌లను స్వీకరించడానికి వీలుగా తయారు చేసారు. అయితే అప్‌లింకు మాత్రం RCP లేదా LCP లలో పనిచేస్తుంది.
32 మీటర్ల యాంటెన్నా వీల్ అండ్ ట్రాక్ డిజైన్‌తో ఉంటుంది. ఈ యాంటెన్నాను S-బ్యాండ్, X- బ్యాండ్ (20 కి.వా.) రెండింటిలోనూ RCP లేదా LCP ద్వారా అప్‌లింక్ చేసే సామర్థ్యంతో రూపొందించారు. రిసెప్షన్ సామర్థ్యం S బ్యాండ్, X బ్యాండ్ (ఏకకాలంలో RCP, LCP) రెండింటిలోనూ ఉంటుంది. ఇది S బ్యాండ్‌లో రెండు క్యారియర్‌లను, X బ్యాండ్‌లో రెండు క్యారియర్‌లనూ అందుకోగలదు. బెంగుళూరులోని ISTRAC కంట్రోల్ సెంటర్ (NCC) నుండి ఈ స్టేషన్‌ను రిమోట్‌గా నియంత్రించవచ్చు.
బ్యాలాలులోని IDSN సదుపాయంలో ISRO నావిగేషన్ సెంటర్ (INC) కూడా ఉంది. 2013 జూన్ 12 న భారతీయ ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్ ఉపగ్రహాలలో మొదటిదైన IRNSS-1A ప్రయోగ సమయంలో ఈ కేంద్రం క్రియాశీలకంగా మారింది. INC లో పరమాణు గడియారం ఉంది. భారతదేశంలోని 21 గ్రౌండ్ స్టేషన్లను సమన్వయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. [2]
ప్రధాన యాంటెన్నా 32-మీటర్ల డీప్ స్పేస్ యాంటెన్నా. 32 మీటర్ల యాంటెన్నా చంద్రయాన్-1 మిషన్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే అత్యాధునిక వ్యవస్థ. ఇది ప్రస్తుతం మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు మద్దతునిస్తోంది [3] ఇది స్పేస్ ఏజెన్సీల మధ్య క్రాస్-సపోర్టును సులభతరం చేస్తుంది. స్టేషన్ ISTRAC నెట్‌వర్క్ కంట్రోల్ సెంటర్ (NCC) నుండి రిమోట్ నియంత్రణలో ఉంటుంది. [4]
రెండవది 18 మీటర్ల డీప్ స్పేస్ యాంటెన్నా. [5]
మూడవది 11 మీటర్ల యాంటెన్నా.
భారతదేశపు మొదటి చంద్రయాత్ర అయిన చంద్రయాన్-1 ను ట్రాక్ చేయడానికి, ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్కును నిర్మించారు. దీన్ని 2008 అక్టోబర్ 22 న ప్రారంభించారు. చంద్రయాన్ ట్రాకింగ్, కక్ష్య నియంత్రణ, హౌస్ కీపింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించారు (2 సంవత్సరాలుగా ప్రణాళిక చేయబడింది, కేవలం 312 రోజులు మాత్రమే వాడారు). IDSN శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి చంద్రయాన్‌ను ప్రారంభించిన 17 నిమిషాల తర్వాత, వాహక నౌక నుండి ప్రోబ్ విడిపోయినప్పటి నుండి దానిని ట్రాక్ చేయడం ప్రారంభించింది.
మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) ని ట్రాక్ చేయడానికి IDSN ను ఉపయోగిస్తున్నారు. [6]