ఇండియన్ నేషనల్ లీగ్ | |
---|---|
అధ్యక్షుడు | మహ్మద్ సులేమాన్ |
ప్రధాన కార్యదర్శి |
|
స్థాపకులు | ఇబ్రహీం సులైమాన్ సైత్ |
స్థాపన తేదీ | 23 ఏప్రిల్ 1994 |
విభజన | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
విద్యార్థి విభాగం | నేషనల్ స్టూడెంట్స్ లీగ్ |
యువత విభాగం | నేషనల్ యూత్ లీగ్ |
ప్రాంతీయత | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ) అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి (తమిళనాడు) |
కేరళ శాసనసభ | 1 / 140 |
Party flag | |
ఇండియన్ నేషనల్ లీగ్ (ఐఎన్ఎల్) అనేది 1994లో అప్పటి ఐయూఎంఎల్ నాయకుడు ఇబ్రహీం సులైమాన్ సైత్ నాయకత్వంలో స్థాపించబడిన భారతీయ రాజకీయ పార్టీ.[1] ఆ పార్టీ ప్రస్తుతం కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ సభ్యుడు.[1] ఇండియన్ నేషనల్ లీగ్ నాయకుడు అహ్మద్ దేవర్కోవిల్, కోజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడు, రెండవ పినరయి విజయన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నాడు.
పిఎంఏ సలామ్అ కేరళ సెంబ్లీకి ఎన్నికైన మొదటి నేషనల్ లీగ్ అభ్యర్థి (2006).[2] ఇండియన్ నేషనల్ లీగ్ 2010ల చివరలో ఎల్డిఎఫ్ లో అధికారికంగా చేర్చబడింది.[2][3]
కేపీఎస్సీ సభ్యుని పోస్టును రూ.40 లక్షలకు ఐఎన్ఎల్ 'అమ్మేసింది' అని ఆరోపించారు.[2]
2002 ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పర్చాం పార్టీ ఆఫ్ ఇండియా, నేషనల్ లోక్తాంత్రిక్ పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం ఫోరమ్, ముస్లిం మజ్లిస్, మోమిన్ కాన్ఫరెన్స్ మొదలైన ముస్లిం రాజకీయ పార్టీలతో కలిసి అవామీ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది.