ఇండియన్ పోలీస్ మెడల్ | |
---|---|
Original ribbon, used for meritorious awards after 1945 Ribbon for gallantry awards 1945–1950 | |
Type | పోలీసు పురస్కారం |
Awarded for | Distinguished Conduct (1932–1944) Meritorious Service or Gallantry (1945–1950) |
అందజేసినవారు | బ్రిటిషు భారతదేసం భారత డొమినియన్ |
Eligibility | భారత పోలీసు సిబ్బంది |
Status | 1951 తరువాత నిలిపివేసారు, దాని స్థానంలో రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రవేశపెట్టారు |
Established | 1932 ఫిబ్రవరి 23 |
ధరించే క్రమం | |
Next (higher) | ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (పౌర) (సాహస)[1] ఇంపీరియల్ సర్వీస్ మెడల్ (meritorious) |
Next (lower) | సిలోన్ పోలీస్ మెడల్(gallantry)[1] సిలోన్ పోలీస్ మెడల్(meritorious) |
Related | ఓవర్సీస్ టెరిటరీస్ పోలీస్ మెడల్ |
ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) అనేది యూరోపియన్, ఆసియన్ పోలీసు సిబ్బందికి బ్రిటిష్ భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం. 1932 లో స్థాపించబడిన ఈ పురస్కారం, కింగ్స్ పోలీస్ మెడల్ పొందేందుకు అవసరమైన దానికంటే తక్కువ స్థాయి ప్రశంసనీయమైన సేవకు, శౌర్యానికీ ఇచ్చారు.
భారతదేశంలోని పోలీసు దళాల సభ్యులకు మరింత గుర్తింపు అవసరమని నిర్ణయించారు. తగినంత గుర్తించదగిన అనేక సేవ, ధైర్య చర్యలు ఉన్నప్పటికీ, కింగ్స్ పోలీస్ మెడల్ యొక్క అవసరాలను తీర్చలేదు. 1932 ఫిబ్రవరి 23 న, భారతీయ పోలీసు పతకాన్ని ప్రవేశపెట్టడానికి రాయల్ వారెంట్ జారీ చేసారు. ఈ పతకం ప్రశంసనీయమైన సేవ, శౌర్య సహసాలు రెండు చర్యలనూ గుర్తించడానికి ఉద్దేశించారు. ఈ పతకం 200 వార్షిక పురస్కారాలకు పరిమితం చేసారు. [2] అసాధారణ పరిస్థితులలో, సంవత్సరంలో అవార్డుల సంఖ్యను 250 కి పెంచడానికి 1942 లో విడుదల చేసిన రాయల్ వారెంటు భారతదేశ వైస్రాయ్ని అనుమతించింది. భారతదేశం రిపబ్లిక్ అయిన తర్వాత ఈ పతకాన్ని ఇవ్వడం నిలిపివేసారు. 1951 మార్చి 15 న భారత ప్రభుత్వం నిలిపివేసింది. దాని స్థానంలో రాష్ట్రఓతి పోలీసు పతకాన్ని ప్రవేశపెట్టారు [3] [4]
ఇండియన్ పోలీస్ మెడల్ గుండ్రంగా ఉంటుంది. దీన్ని కాంస్యంతో తయారు చేస్తారు. బొమ్మ వైపు రాజు యొక్క బొమ్మ ఉంటుంది. వెనుకవైపు అంచు చుట్టూ ఒక పుష్పగుచ్ఛం ఉంటుంది. దీనికంటే ఎత్తుగా కిరీటం ఉంటుంది. మధ్యలో పతకాన్ని ప్రదాన చేసిన పరిస్థితులను బట్టి ఫర్ గాలంట్రీ అని గానీ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అని గానీ ఉంటుంది. పతకపు తొలి కూర్పులో ఫర్ డిస్టింగ్విష్డ్ కాండక్ట్ అని ఉండేది. [5] [4]
పతకాన్ని వేలడదీసే రిబ్బను, సర్వీస్ రిబ్బన్లు 1+3⁄8 అంగుళాలు (35 mమీ.) వెడల్పుతో ఉండేవి. ఇది ముదురు నీలం రంగులో, వెండి అంచుతో ఉండేది. మధ్యలో క్రిమ్సన్ రంగు పట్టీ ఉండేది. శౌర్య పురస్కారాల కోసం, నీలిరంగు విభాగాల్లో సన్నని వెండి గీతలుండేవి. [4]
<ref>
ట్యాగు; "myb2004" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు