ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ | |
---|---|
Chairperson | నౌసాద్ సిద్ధిక్ |
స్థాపకులు | అబ్బాస్ సిద్ధిఖీ |
స్థాపన తేదీ | 21 జనవరి 2021 |
రాజకీయ విధానం | మైనారిటీ హక్కులు |
ECI Status | గుర్తించబడలేదు |
కూటమి | సంజుక్త మోర్చా (2021-2024) |
లోక్‌సభ స్థానాలు | 0 / 543 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 1 / 294 |
Election symbol | |
![]() | |
Party flag | |
![]() | |
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనేది పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ పార్టీ. హుగ్లీ జిల్లాలోని ఫుర్ఫురా షరీఫ్ పుణ్యక్షేత్ర మతాధికారి అబ్బాస్ సిద్ధిఖీ ఈ పార్టీని స్థాపించాడు.[1]
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పార్టీ స్థాపించబడింది.[2] తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్[3] నేతృత్వంలోని సంజుక్త మోర్చా[3]లో చేరింది.[4] పార్టీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 38 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానంలో గెలిచింది.[5] బీహార్ ఆధారిత రాజకీయ పార్టీ అయిన రాష్ట్రీయ సెక్యులర్ మజ్లిస్ పార్టీ అరువు తెచ్చుకున్న గుర్తుపై పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల తర్వాత, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధినేత అధిర్ రంజన్ చౌదరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో పొత్తుకు ముగింపు పలికారు.[6]
'సెక్యులర్' అని చెప్పుకుంటున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకుడు ప్రసేన్‌జిత్ బోస్ పార్టీని 'కమ్యూనల్'గా అభివర్ణించారు.[7]
2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల కోసం, ఈ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో సంజుక్త మోర్చా అనే కూటమిలో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి నౌసాద్ సిద్ధిఖ్ ఒక్కరే ఎమ్మెల్యే.
ఎన్నికల సంవత్సరం | పార్టీ నాయకుడు | పోటీచేసిన సీట్లు | గెలుచిన సీట్లు | సీట్లలో మార్పు | ఓట్ల శాతం | ఓట్ల మార్పు | జనాదరణ పొందిన ఓటు |
---|---|---|---|---|---|---|---|
2021 | నౌసాద్ సిద్ధిక్ [8] | 32 [9] | 1 | ![]() |
1.35% | N/A | 813,489 |