ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల (ఆగ్లం: Indira Gandhi Zoological park) విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలో గల ఒక చూడవలసిన ప్రదేశము.
ఇది మే 19, 1977.[1]లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 10 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.
తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.
దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.
శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, తిరుపతి నుంచి 2022 మార్చి 17న గ్రే జంగిల్ పౌల్, వైల్డ్ డాగ్, అడవి దున్న, చౌసింగ్ లను ఇక్కడకు తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ నందినీ సలారియా తెలిపారు. ఇక్కడి నుంచి హైనా, అడవిదున్న, నక్కలను తిరుపతి జూకు తరలించామన్నారు.[2]
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను నుండి 11 కి.మీ దూరంలో జాతీయ రహదారి 16 మార్గంలో యందాడ సమీపంలో వుంది. ప్రవేశ ద్వారం, నిర్గమన ద్వారాలలో ఒకటి జాతీయ రహదారి వైపు, రెండవది బీచ్ రహదారివైపు సాగర నగర్ దగ్గర వున్నాయి. సోమవారం తప్ప ఇతర రోజులలో సందర్శకులను అనుమితిస్తారు.