ఇంద్రజిత్ సుకుమారన్ | |
---|---|
జననం | తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 1979 డిసెంబరు 17
విశ్వవిద్యాలయాలు | సైనిక్ స్కూల్, కజకూటం |
వృత్తి | |
క్రియాశీలక సంవత్సరాలు | 1984 (బాల నటుడు); 2002–ప్రస్తుతం |
భార్య / భర్త | |
పిల్లలు | 2, (ప్రార్థన ఇంద్రజిత్ తో సహా) |
బంధువులు | పృథ్వీరాజ్ సుకుమారన్ (సోదరుడు) |
తండ్రి | సుకుమారన్ |
తల్లి | మల్లికా సుకుమారన్ |
ఇంద్రజిత్ సుకుమారన్ (జననం 1979 డిసెంబరు 17) ఒక భారతీయ నటుడు, గాయకుడు. ఆయన ప్రధానంగా మలయాళ చిత్రసీమలో పనిచేస్తున్నాడు. ఇంద్రజిత్ నటులు సుకుమారన్, మల్లికా సుకుమారన్ దంపతులకు జన్మించాడు. ఆయనకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నయ్య ఉన్నాడు.
1986లో వచ్చిన పదాయణి చిత్రంలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఇంద్రజిత్, 90కి పైగా చిత్రాల్లో నటించాడు, ముఖ్యంగా మీసా మాధవన్ (2002), రన్ వే (2004), వేషం (2004), క్లాస్ మేట్స్ (2006), చోట్టా ముంబై (2007), అరబిక్కథ (2007), ట్వంటీ 20 (2008), నాయకన్ (2010), ఈ అదుత కాలతు (2012), ఆమేన్ (2013), లెఫ్ట్ రైట్ లెఫ్ట్ (2013), ఎజమతే వరవు (2013), ఏంజిల్స్ (2014), అమర్ అక్బర్ ఆంథోనీ (2015), వైరస్ (2019), లూసిఫర్ (2019), హలాల్ లవ్ స్టోరీ (2020), కురూప్ స్టోరీ (2020) వంటి చిత్రాలలో తన నటనకు గుర్తింపు లభించింది.
ఇంద్రజిత్ కొన్ని తమిళ, ఆంగ్ల, తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. వాటిలో ఎన్ మన వనీల్ (2002), బిఫోర్ ది రెయిన్స్ (2007), సర్వం (2009), కావ్యాస్ డైరీ (2009), ది వెయిటింగ్ రూమ్ (2010) వంటివి చెప్పుకోవచ్చు.
ఇంద్రజిత్ నటులు సుకుమారన్, మల్లికా సుకుమారన్ లకు పెద్ద కుమారుడిగా 1979 డిసెంబర్ 17న జన్మించాడు. ఆయన సోదరుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రసిద్ధ నటుడు.[1]
ఇంద్రజిత్ ప్రారంభ పాఠశాల విద్య చెన్నై టి. నగర్ లోని శ్రైన్ వైలంకన్ని సీనియర్ సెకండరీ స్కూల్, కూనూర్ లోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ స్కూల్ లలో జరిగింది.[2] తమిళనాడు నుండి వారి కుటుంబం కేరళకు మారినాక, అతను పూజప్పుర సెయింట్ మేరీస్ రెసిడెన్షియల్ సెంట్రల్ స్కూల్, ది ఎన్ఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ పెరున్తన్ని నుండి విద్యను అభ్యసించాడు. అతను తన సోదరుడు పృథ్వీరాజ్ తో కలిసి సైనిక్ స్కూల్ కజకూటం తన మిగిలిన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అక్కడ చదువుతున్నప్పుడు టెన్నిస్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆయన సంగీతం, నటన పోటీలలో కూడా పాల్గొన్నాడు. ఆయన తిరునెల్వేలి జిల్లా రాజాస్ ఇంజనీరింగ్ కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. సినీ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమాలతో బిజీగా మారాడు.
1986లో పడయాని చిత్రంలో బాలనటుడిగా మలయాళ చిత్రసీమలో తన వృత్తిని ప్రారంభించాడు. లాల్ జోస్ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ మీసా మాధవన్ చిత్రంలో ఈప్పెన్ పప్పాచి అనే ప్రతినాయకుడి పాత్రకు ఆయన ప్రసిద్ధి చెందాడు.
ఆయన అన్వర్ రషీద్ చోట్టా ముంబై, షాజీ కైలాస్ బాబా కళ్యాణిలో మోహన్ లాల్ తో కలిసి నటించాడు. బాబా కళ్యాణిలో విలన్ గా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3] ఆయన మమ్ముట్టి కలిసి వేషం చిత్రంలో నటించారు.
ఆయన లాల్ జోస్ అరబిక్కథ, సంతోష్ శివన్ బిఫోర్ ది రెయిన్స్ చిత్రాలలో కూడా నటించాడు. అతను తన సోదరుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 2006లో వచ్చిన హిట్ చిత్రం క్లాస్ మేట్స్ తో సహా అనేక చిత్రాలలో నటించాడు.[4][5] పళస్సీ రాజా (2009) విజయం తర్వాత ఎం. టి. వాసుదేవన్ నాయర్ రాసిన హరిహరన్ చిత్రం ఎజమాతే వరవు లో ఆయన వినీత్ తో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు.
ఆయన తొలి హిందీ చిత్రం మనీజ్ ప్రేమ్నాథ్ దర్శకత్వం వహించిన ది వెయిటింగ్ రూమ్ జనవరి 2010లో విడుదలైంది.[6]
2002 డిసెంబర్ 13న ఆయన నటి పూర్ణిమ మోహన్ ను వివాహం చేసుకున్నాడు.[7] వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[8]