ఇంద్రదీప్ సిన్హా | |
---|---|
రాజ్యసభ సభ్యుడు | |
In office 1974–1986 | |
వ్యక్తిగత వివరాలు | |
మరణం | 9 జూన్ 2003 |
కళాశాల | పాట్నా విశ్వవిద్యాలయం |
ఇంద్రదీప్ సిన్హా (1914 జూలై[1] - 2003 జూన్ 9) [2] స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 1964 నుండి పదెళ్లు సభ్యత్వంతో పాటూ బీహార్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆదాయ మంత్రిగా కూడా పనిచేశారు.
బీహార్‌లోని ప్రస్తుత సివాన్ జిల్లాలోని షకర గ్రామంలో జన్మించాడు. 1938లో[3] పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. దాదాపు 25 పుస్తకాలు రాశాడు. సిన్హా 1940లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.[4] లెక్చరర్ గా జర్నలిస్ట్ గానే కాక, సిన్హా 1962 నుండి 1967 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ బీహార్ రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శిగా ఉన్నారు. 1973 నుండి 1990 ల చివరి వరకు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హన్కార్, జనశక్తి, న్యూ ఏజ్ వారపత్రికలకు సిన్హా ఎడిటర్ వ్యవహరించారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వంతో ఇంద్రదీప్ సిన్హా తన శాసన జీవితాన్ని 1964లో ప్రారంభించి 1974 వరకు కొనసాగారు. అతను 1967 నుండి 1968 వరకు బీహార్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆదాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఆదాయ మంత్రిగా, అతను పేదల పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రంలో భూమిలేని వారికి భూమి పంపిణీకి చర్యలు తీసుకున్నారు. సిన్హా 1974 ఏప్రిల్ నుండి 1980 ఏప్రిల్ వరకు, తిరిగి 1980 జూలై నుండి 1986 జూలై వరకు రెండు పర్యాయాలు రాజ్యసభలో బీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు.