ఇటలీలో 0.3% మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నారు. ఇటలీ పౌరులలో 0.1% మంది, వలస వచ్చిన జనాభాలో 2.9% మంది హిందువులున్నారు. [1] 2012 నాటికి ఇటలీలో దాదాపు 90,000 మంది హిందువులు ఉన్నారు. [2] 2015 నాటికి ఈ జనాభా 1,20,000 కు పెరిగింది. 2021 నాటికి, జనాభా దాదాపు 1,80,000 ఉంది. యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఐరోపాలో ఇది రెండవ అతిపెద్ద హిందూ సంఘం.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2012 | 90,000 | — |
2015 | 1,20,000 | +33.3% |
2021 | 1,80,000 | +50.0% |
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2012 | 0.1% | - |
2015 | 0.2% | +0.1% |
2021 | 0.3% | +0.1% |
ఇటలీలో అధికారిక గుర్తింపు కోసం హిందువులు ఒత్తిడి చేస్తున్నారు. యూనియన్ ఇండయిస్టా ఇటాలియా 2007లో ఇటాలియన్ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. ఇటలీ పార్లమెంటు 2012లో బౌద్ధమతంతో పాటు హిందూమతానికి అధికారిక గుర్తింపును ఇచ్చింది. [3] 2012 డిసెంబరు 11 న, ఇటలీ పార్లమెంటు ఇటాలియన్ హిందూ యూనియన్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని (ఇంటెసా) ఆమోదించింది (L.31/12/2012 n. 246). ఒప్పంద చట్టంలోని ఆర్టికల్ 24లో ప్రకటించినట్లుగా, దీపావళిని ఇటలీలో అధికారిక హిందూ పండుగగా గుర్తించారు. [4]
ఐరోపాలోని మూడు హిందూ మఠాలలో ఇది ఒకటి. మాతా గీతానంద ఆశ్రమం అల్టారే మునిసిపాలిటీలోని లోకాలిటా పెల్లెగ్రినోలో ఉంది. ఇది సవోనా లోతట్టు ప్రాంతంలో 520 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఉంది. [5]