ఇనుకొండ తిరుమలి | |
---|---|
జననం | |
వృత్తి | విద్యావేత్త, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణ ఉద్యమం |
ఇనుకొండ తిరుమలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు,[1][2] ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమకారుడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యుడు పనిచేసిన తిరుమలి,[3] తెలంగాణ ప్రజా సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[4]
తిరుమలి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పెద్దగోపతి గ్రామంలో జన్మించాడు. తిరుమలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగంలో ఎంఏ పూర్తిచేశాడు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్ నుండి తెలంగాణ వ్యవసాయ సంబంధాలపై ఎంఫిల్, తెలంగాణ రైతాంగ ఉద్యమంపై పిహెచ్‌డి చేశాడు.[5]
తిరుమలి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల చరిత్ర విభాగంలో 1980 నుండి 30 సంవత్సరాలపాటు ఆచార్యుడిగా పనిచేశాడు.[1] 1984-86, 2001-2003, 2006-2008 మధ్యకాలాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలలోని చరిత్ర విభాగంలో టీచర్-ఇన్-చార్జ్ గా ఉన్నాడు. తెలంగాణ, తెలంగాణలో భూస్వామ్య విధానంపై పలు పుస్తకాలు రాశాడు.[6]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)