విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 | |
---|---|
ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యొక్క ఇతర మార్గాల ద్వారా జరిగే లావాదేవీలకు చట్టపరమైన గుర్తింపును అందించే చట్టం, దీనిని సాధారణంగా "ఎలక్ట్రానిక్ కామర్స్" అని పిలుస్తారు. | |
Citation | Information Technology Act, 2000 |
Enacted by | భారతదేశ పార్లమెంటు |
Date enacted | 9 జూన్ 2000 |
Date assented to | 9 జూన్ 2000 |
సంతకం చేసిన తేదీ | 9 మే 2000 |
అమలు లోకి వచ్చిన తేదీ | 17 అక్టోబరు 2000 |
Introduced by | ప్రమోద్ మహాజన్ సమాచార, సాంకేతిక శాఖామాత్యులు |
Amendments | |
IT (Amendment) Act 2008 | |
Related legislation | |
IT Rules 2021 | |
స్థితి: గణనీయంగా మారింది |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (అంటే సమాచార సంకేతిక చట్టం 2000) అనే చట్టం భారత దేశ పార్లమెంటులో చట్టం సంఖ్య 21 ఆఫ్ 2000 గా నోటిఫై చేయబడి 2000 అక్టోబరు 17 తేదిన అమలులోకి వచ్చింది. దీనిని ITA 2000 అని, IT Act అని జనబాహుల్యం ఎక్కువగా పిలుస్తారు.[1] ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్ చేంజ్, అటువంటి మార్గాలైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే లావాదేవీలకు చట్టపరమైన గుర్తింపు తేవడానికిగాను ఆమోదించబడిన చట్టం.
|IT ACT 2000| ఏర్పాటు•• 1996 లో UNCIPRAL(United Nations committee on international trade law) వివిధ దేశాలలో చట్టాల ఏకరూపత కోసం E-commerce చట్టాన్ని ఆమోదంచింది
-UN జనరల్ అసెంబ్లీ సభ్య దేశాలు అన్ని తమ సొంత చట్టాలను మార్పులు చేసే ముందు తప్పనిసరిగా ఈ నమూనా చట్టాన్ని పరిగణించాలి అని సిఫార్సు చేసింది
-IT ACT 2000 ను ఆమోదించిన తరువాత cyber law ని ప్రారంభించిన 12 వ దేశంగా భారత్ ఆవిర్భవించింది - భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ E commerce చట్టం 1998 గా మొదటి సారిగ ఏర్పాటు చేసింది.అయితే మరల దానిని సవరణ చేసి IT ACT గా చేశారు. ~దీనిని 1999& 2000 వ సంవత్సరం లో ఆమోదించారు.
ఎలక్ట్రానిక్ పత్రాల చట్టపరమైన గుర్తింపు.
డిజిటల్ సంతకాల చట్టపరమైన గుర్తింపు.
సైబర్/ఇంటర్నెట్/ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించిన నేరాలు, ఉల్లంఘనలు.
సైబర్ నేరాలకు సంబదించిన న్యాయ వ్యవస్థీకరణ.
ఈ చట్ట సవరణ ద్వారా భారత ప్రభుత్వం సైబర్ ఉగ్రవాదం, డేటా రక్షణ సంబదిత నేరాలకు సంబంధించిన ఎన్నో క్రొత్త విభాగాలు జోడించింది .
<references>