ఇన్శాట్-2E ఉపగ్రహం

ఇన్శాట్-2E ఉపగ్రహం
మిషన్ రకంCommunication
Weather
ఆపరేటర్ISRO
COSPAR ID1999-016A Edit this at Wikidata
SATCAT no.25666Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 years (planned)
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి2,550 కిలోగ్రాములు (5,620 పౌ.)
శక్తి2,050 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2 April 1999, 22:03 UTC (1999-04-02UTC22:03Z)
రాకెట్Ariane 42P
లాంచ్ సైట్Kourou ELA-2
కాంట్రాక్టర్Arianespace
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం83° East
Perigee altitude35,766 కిలోమీటర్లు (22,224 మై.)
Apogee altitude35,806 కిలోమీటర్లు (22,249 మై.)
వాలు0 degrees
వ్యవధి24 hours
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్17 G/H band
 

ఇన్శాట్-2E ఉపగ్రహం భారతదేశపు ఉపగ్రహం. ఇండియన్ నేషనల్ శాటలైట్ సిష్టం ప్రణాళికభాగంగా భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ (isro) వారు, వారి నిర్వహణ, పరివేక్షణలో అంతరిక్షములో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఇన్శాట్-2E ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని సమాచారసేకరణ, ప్రసరణ, వాతావరణ పరిశీలన/పరిశోధనకై ఉపయోగార్ధమై ప్రయోగించారు. తూర్పుకు 83° డిగ్రీల అక్షాంశమలో భూస్థిరకక్ష్యలో పరిభ్రమిస్తూ తిరిగేలా అంతరిక్షములో ప్రవేశపెట్టారు.పైన పేర్కొన్న కక్ష్య పరిధిలో పరిభ్రమించు ఈ ఉపగ్రహం ఆసియా, ఆస్ట్రేలియాలో సమాచార సేవలను అందిస్తుంది.ఈ ఉపగ్రహం రెండు మేటిరియోలాజికల్/ వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధి పరికరాలు:ఎక్కువ రేసోల్యుసన్ రేడియో మీటరు, ఒక CCD కెమరాను కలిగిఉన్నది. ఈ కెమరా ఒకకిలోమీటరు పరిధి వరకు చిత్రాన్ని చిత్రించి పంపు రేసోల్యుసన్ కలిగిఉన్నది.[1]

INSAT-2E ఉపగ్రహంలో 12 G/H బ్యాండ్ (IEEE Cబ్యాండ్) ట్రాన్స్‌పాండరులను అమర్చారు.[2] ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు 2,550కిలోలు (5,620 పౌండ్లు).ఉపగ్రహం యొక్క పనిచేయు జీవితకాలం 12 సంవత్సరాలు.[3] ఇందులోని కొన్ని ట్రాన్స్‌పాండరులను ఇంటెల్ శాట్ (Intelsat) వారికి గుత్తకు (lease) ఇచ్చారు. ఇంటెల్‌శాట్ వాళ్ళు ఈ ట్రాన్స్‌పాండరులను Intelsat APR-2. అనేపేరు మీద ఆపరేట్ చేస్తున్నారు.

ఉపగ్రహ ప్రయోగం

[మార్చు]

ఈ ఉపగ్రహాన్నిదక్షిణ అమెరికా, ఫ్రెంచి గయానాలోని, ELA-2 ఉపగ్రహ ప్రయోగ వేదిక నుండి, ఏరియన్ 42Pఅను ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక ద్వారా ద్వారా1999 ఏప్రిల్ 2 న 22:03 (GMT) గంటలకు అంతరిక్షములోకి పంపారు.[4] ప్రయోగానంతరం, ఉపగ్రహంలో ఉన్న ద్రవఇంధనంతో పనిచేయు అపోజీ మోటరును మండించి 1999 ఏప్రిల్ 8 న ఉపగ్రహాన్ని నిర్దేశించిన భూస్థిరకక్ష్యలో పరిభ్రమించేలా, 83°డిగ్రీల తూర్పు రెఖాంశ కక్ష్యలో స్థిర పరిచారు.[5]

ఇవి కూడా చూదండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "INSAT-2E". Indian Space Research Organisation. Archived from the original on 2013-08-18. Retrieved 2009-08-08.
  2. Krebs, Gunter. "Insat 2E / Intelsat APR-2". Gunter's Space Page. Retrieved 2009-08-08.
  3. "UCS Satellite Database". Union of Concerned Scientists. 1 July 2009. Retrieved 2009-08-08.
  4. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 2009-08-08.
  5. McDowell, Jonathan. "Index". Geostationary Orbit Catalog. Jonathan's Space Page. Archived from the original on 2010-04-06. Retrieved 2009-08-08.