ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (The Institute of Cost Accountants of India (ICMAI), (The Institute of Cost & Works Accountants of India (ICWAI) కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ రంగంలో విద్య, శిక్షణను అందించడానికి ఒక చట్టబద్ధమైన వృత్తిపరమైన సంస్థగా భారత ప్రభుత్వం 1959 లో పార్లమెంటు చట్టం కింద స్థాపించబడినది. ఈ సంస్థ ప్రపంచంలో 2 వ అతిపెద్ద కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటింగ్ బాడీ, ఆసియాలో అతిపెద్దది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్ ఏసీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ అండ్ పసిఫిక్ అకౌంటెంట్స్ (సీఏపీఏ), సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఎస్ ఏఎఫ్ ఏ) వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఈ సంస్థ భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంది. ప్రధాన కార్యాలయం కోల్కతాలో, కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఉన్న నాలుగు ప్రాంతీయ కౌన్సిల్లు, భారతదేశం అంతటా 110 చాప్టర్లు, 11 ఓవర్సీస్ సెంటర్లను కలిగి ఉంది.[1]
సంకేతాక్షరం | ఐసిడబ్ల్యుఎ |
---|---|
స్థాపన | 28 మే 1959 |
చట్టబద్ధత | మనుగడలో ఉంది |
ప్రధాన కార్యాలయాలు | సిఎంఎ భవన్, 12 సుద్దర్ స్ట్రీట్, కోల్కతా - 700016 ఇండియా కోల్కతా, భారతదేశం |
భౌగోళికాంశాలు | 22°33′29″N 88°21′13″E / 22.558103°N 88.353672°E |
సేవా | భారతదేశం |
సభ్యులు | 89700 |
President | సీఎంఏ విజేంద్ర శర్మ |
ఉపాధ్యక్షుడు | సీఎంఏ రాకేశ్ భల్లా |
మాతృ సంస్థ | కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
మారుపేరు | ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా |
కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటెన్సీని అభివృద్ధి చేయడం ఆర్థిక కార్యకలాపాల అన్ని రంగాలలో నిర్వహణ నియంత్రణ చేయడం. కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటెన్సీలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, సభ్యుల ప్రొఫెషనల్ బాడీని అభివృద్ధి చేయడం, వారి విధులను నిర్వహించడానికి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నేపధ్యంలో ఇన్స్టిట్యూట్ లక్ష్యాలను నెరవేర్చడానికి వారిని పూర్తిగా సన్నద్ధం చేయడం. కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటింగ్ సూత్రాలు, పద్ధతుల్లో తాజా పరిణామాలను తెలుసుకోవడానికి, పరిశ్రమ ఇతర ఆర్థిక కార్యకలాపాల స్థిరమైన మార్పులను చేర్చడం వంటి వాటిని చేపట్టుతుంది.
ఈ వృత్తిలోకి ప్రవేశించేవారికి పర్యవేక్షణను నిర్వహించడం,ఉత్తమ నైతిక ప్రమాణాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా చూడటం, వృత్తిపరమైన ఎదుగుదలకు అవసరమైన ఆలోచనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వృత్తిపరమైన ఆసక్తి గల అంశాలపై సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తుంది.
వివిధ ఆర్థిక రంగాలకు సంబంధించిన పరిశోధన, ప్రచురణ కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు, భారతదేశం,విదేశాల్లోని పారిశ్రామిక, విద్య, వాణిజ్య రంగాలలో ఉన్న సభ్యులకు వృత్తిపరమైన సమాచారాన్ని అందుబాటులో తేవడానికి, వ్యాప్తి చేయడానికి వాటికీ సంభందించిన పుస్తకాలను, బుక్ లెట్ లను ప్రచురించడం వంటివి సంస్థ లక్ష్యాలుగా పెట్టుకొని తన విధులను నిర్వహిస్తుంది.[2]
ఇన్ స్టిట్యూట్ తుది పరీక్షలో ఉత్తీర్ణులైన ,కాస్టింగ్ లేదా ఇండస్ట్రియల్ అకౌంటింగ్ వివిధ బ్రాంచీలు అంటే స్టోర్స్, మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్ మొదలైన వాటి సమ్మేళనంతో మూడు సంవత్సరాలకు తగ్గకుండా ప్రత్యక్ష శిక్షణా (ప్రాక్టికల్) అనుభవం పొందిన వ్యక్తి, ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పారిశ్రామిక లేదా వాణిజ్య లేదా ప్రభుత్వ విభాగాలు లేదా విభాగాలలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, కౌన్సిల్ కు సరైన ఆ శిక్షణ కు సంభందించిన పత్రాలను సమర్పించి, కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత, ఇన్స్టిట్యూట్ అసోసియేట్ సభ్యత్వంలో ప్రవేశం పొందవచ్చు. పైన పేర్కొన్న ప్రాక్టికల్ అనుభవాన్ని తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు లేదా తరువాత లేదా పాక్షికంగా ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, పాక్షికంగా పొందిన తర్వాత పొందవచ్చు. కౌన్సిల్ లో అసోసియేట్ మెంబర్ షిప్ లో ప్రవేశం పొందడానికి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా ఇలాంటి ఇతర ఆర్థిక సంస్థల్లో, ప్రతిదానిలో సూచించిన కాలవ్యవధికి అనుభవం, కౌన్సిల్ సంతృప్తికి లోబడి అసోసియేట్ మెంబర్ షిప్ లో ప్రవేశం పొందవచ్చును.[4]
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో ప్రాజెక్ట్ విశ్లేషణ, సాధ్యాసాధ్యాల నివేదికలు, ఆర్థిక లాభదాయకత విశ్లేషణ మొదలైన వాటితో కూడిన అనుభవం లేదా సంస్థల ఆర్థిక సామర్థ్య విశ్లేషణను పూర్తి కాల ప్రాతిపదికన కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
విశ్వవిద్యాలయాలు, మేనేజ్ మెంట్ సంస్థలు మొదలైనవాటిలో ప్రాజెక్ట్ లు, కాస్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటింగ్, ఇతర మేనేజ్ మెంట్ విధుల్లో ఆర్థిక శాస్త్రము నందు విశ్లేషణతో కనీసం మూడు సంవత్సరాల పాటు నిర్దిష్ట అధ్యయనాలను నిర్వహించడంలో ఆచరణాత్మక అనుభవం ఉండాలి.
ప్రాక్టీస్ కాస్ట్ అకౌంటెంట్ తో కనీసం మూడు సంవత్సరాల కాలానికి పూర్తి సమయం (ఫుల్ టైమ్) ప్రాతిపదికన లేదా ఏదైనా సంస్థలో కనీసం ఐదేళ్లపాటు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
ఇంజినీరింగ్ ప్రాతిపదికన విశ్లేషణ, ప్రాజెక్టు స్టడీ, అనుబంధ విభాగాల్లో కనీసం మూడేళ్లపాటు అనుభవం ఉండాలి.
2 . ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ది కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్న వ్యక్తుల సభ్యతం.
1. కాస్ట్ అకౌంటింగ్ విధులకు ప్రత్యక్ష బాధ్యత వహించే కంపెనీ సెక్రటరీగా కనీసం మూడేళ్ల పాటు అనుభవం ఉండాలి.
2. రూ.25 లక్షలకు తగ్గకుండా పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న తయారీ( మాన్యుఫాక్చరింగ్) కంపెనీలో కనీసం మూడేళ్ల పాటు కాస్ట్ అకౌంటింగ్ విధులతో ఉన్న కంపెనీ సెక్రటరీగా అనుభవం ఉండాలి.
3. రెండున్నరేళ్ల పాటు ఫుల్ టైమ్ ప్రాతిపదికన కాస్ట్ అకౌంటింగ్ విధుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్/ అనుభవం ఉండాలి.
ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కనీసం ఐదేళ్ల పాటు కాస్ట్ అకౌంటెన్సీలో బోధన అనుభవం ఉండాలి.
అసోసియేట్ మెంబర్ షిప్/ఫెలో మెంబర్ సభ్యత్యం కొరకు నిర్దేశిత ఫారం "M2"లో దరఖాస్తు చేయాలి, దానితో పాటు అసోసియేట్ మెంబర్ ఫెలో మెంబర్ ప్రవేశ రుసుము రూ.1000/-, సంవత్సర సభ్యత్వ రుసుము రూ.1000/- అభ్యర్థి కౌన్సిల్ కు అందచేయాలి, అభ్యర్థి కి ఏదైనా కారణాలతో సభ్యత్యం రాకపోతే, దరఖాస్తు ఫీజు తిరిగి ఇవ్వటం జరుగుతుంది.