వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇయాన్ ఎడ్వర్డ్ ఓ'బ్రియన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లోయర్ హట్, న్యూజీలాండ్ | 1976 జూలై 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 229) | 2005 మార్చి 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2009 డిసెంబరు 11 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 147) | 2008 ఫిబ్రవరి 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మార్చి 14 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 38) | 2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 జూన్ 6 - స్కాంట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2009/10 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009 | లీసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | మిడిల్‌సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2012 జనవరి 31 |
ఇయాన్ ఎడ్వర్డ్ ఓ'బ్రియన్ (జననం 1976, జూలై 10) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. పేస్ బౌలర్ గా రాణించాడు. 2008లో వెస్టిండీస్‌పై 75 పరుగులకు 6 వికెట్లతో 73 టెస్ట్ వికెట్ల ఘనత సాధించాడు. వెల్లింగ్టన్, లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్, మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
దీర్ఘకాలిక గాయ సమస్యల కారణంగా 2012 జనవరిలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[1]
షేన్ బాండ్, డారిల్ టఫ్ఫీ, క్రిస్ మార్టిన్ వంటి సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్ళకు గాయాలైన తర్వాత ఓ'బ్రియన్ 2005 మార్చిలో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు.[2] ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. 6 ఓవర్లలో 1/59 స్కోరుతో అరంగేట్రం చేశాడు.
2007 - 2009 మధ్యకాలంలో టెస్ట్ జట్టులో, వన్డేలో ఆడాడు. 'ఇన్‌టు-ది-విండ్' బౌలర్‌గా ప్రసిద్ధి చెందాడు. యుకెలో ఇంగ్లాండ్‌పై, స్వదేశంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శనలతో బ్లాక్ క్యాప్స్‌కు ఫాస్ట్ బౌలర్‌గా చాలా రాణించాడు. అక్కడ బౌలింగ్‌లో 6/75తో తన అత్యుత్తమ టెస్ట్ గణాంకాలను సాధించాడు. వెల్లింగ్టన్ తరపున ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా స్వదేశంలో, బయట తన స్థిరమైన స్పెల్లను కొనసాగించాడు.
2008లో న్యూజీలాండ్ ఇంగ్లాండ్ పర్యటనలో 26.80 సగటుతో 15 వికెట్లు తీశాడు.[3] 2009 డిసెంబరులో స్వదేశంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా, బొటనవేలు విరిగిన సమయంలో 3 వికెట్లు తీసి న్యూజీలాండ్‌ను గెలిపించడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదే సిరీస్‌లో తదుపరి మ్యాచ్ లో 4/66తో సహా 6 వికెట్లు తీశాడు. సల్మాన్ బట్, ఇమ్రాన్ ఫర్హత్, మిస్బా-ఉల్-హక్ వంటి వారిని అవుట్ చేశాడు.
2009 డిసెంబరులో, ఇంగ్లాండ్‌లో తన భార్యతో ఎక్కువ సమయం గడపడానికి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.[4] ఈ నిర్ణయం మిడిల్‌సెక్స్ 2010 సీజన్‌లో ఓ'బ్రియన్‌ను తమ విదేశీ ఆటగాడిగా సంతకం చేయడానికి ప్రభావం చూపించింది.[5]