వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇందర్‌బీర్ సింగ్ సోధి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లూఢియానా, పంజాబ్, భారతదేశం | 1992 అక్టోబరు 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Ice Ice Sodhi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 262) | 2013 అక్టోబరు 9 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జనవరి 02 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 187) | 2015 ఆగస్టు 2 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 31 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 61 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 64) | 2014 జూలై 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 61 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–present | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016/17 | అడిలైడ్ స్ట్రైకర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | నాటింగ్‌హామ్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | జమైకా తలావాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | St Kitts and Nevis Patriots | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | వెల్ష్ ఫైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 1 September 2023 |
ఇందర్బీర్ సింగ్ "ఇష్" సోధీ (జననం 1992 అక్టోబరు 31) భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించిన న్యూజిలాండ్ క్రికెటర్, అతను అన్ని ఫార్మాట్‌లలో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ క్రికెట్‌లో కాంటర్‌బరీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. [1] అతను కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, కుడిచేతితో బ్యాటింగ్ చేస్తాడు. అతను 2018 జనవరిలో T20I బౌలర్లలో నం.1 ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు. [2]
సోధీ ఒక పంజాబీ. భారతదేశంలోని లూథియానాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. [3] అతని తాతలు పాకిస్తాన్ విభజనకు ముందు లాహోర్ నుండి వచ్చారు. [4] అతను నాలుగు సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లోని పాపటోటోకి మారాడు. అతను పాపటోటో హై స్కూల్‌లో చదివాడు. [5]
సోధి 2012–13 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరఫున రంగప్రవేశం చేశాడు.
2017లో, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు జట్టులో సోధి పేరు లేదు. అపుడతను అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున గాయపడీన క్రిస్ జోర్డాన్ స్థానంలో ఆడ్డాడు. జనవరి 18న స్ట్రైకర్స్ కోసం తన మూడవ గేమ్‌లో, అతను 3.3 ఓవర్లలో 6/11తో మ్యాచ్‌ను ముగించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని గెలుచుకున్నాడు. లసిత్ మలింగ 6/7 తర్వాత బిగ్ బాష్ చరిత్రలో ఇవి రెండవ అత్యుత్తమ గణాంకాలు. [6] [7]
అతను 2018-19 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలో 36 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు. [8] 2020 IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని విడుదల చేసింది. [9] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [10] [11]
న్యూజిలాండ్ 2013 బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతని అంతర్జాతీయ రంగప్రవేశం జరిగింది. 2014 జూలైలో వెస్టిండీస్‌పై ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. 2014 నవంబరులో సోధీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌లో, అతను 63 పరుగులు చేశాడు, ఇది వ్యక్తిగత అత్యుత్తమ స్కోరే కాక, టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ నంబర్-టెన్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యుత్తమ స్కోరు. సోధీ 2015 ఆగస్టు 2న జింబాబ్వేపై న్యూజిలాండ్ తరపున వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు [12]
2018 మేలో, న్యూజిలాండ్ క్రికెట్ ద్వారా 2018–19 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [13] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [14] [15] 2021 ఆగష్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో సోధిని ఎంపిక చేశారు. [16]
2022 డిసెంబరులో, సోధీని 4 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ టెస్టు స్క్వాడ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం మళ్ళీ తీసుకున్నారు. [17] మొదటి టెస్ట్‌లో, అతను టెస్టు క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట తీసాడు. [18] మొదటి ఇన్నింగ్స్‌లో అతని కెరీర్‌లో అత్యుత్తమ 65 పరుగులను సాధించాడు. [19]
{{citation}}
: CS1 maint: numeric names: authors list (link)