భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ఉపగ్రహాల, ప్రయోగాల టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ (TTC) ల మద్దతు కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక భూస్థిత స్టేషన్ల నెట్‌వర్కును ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాలన్నిటినీ ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) క్రింద సమీకరించి నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
2013 నవంబరు నాటికి ISTRAC లో కింది సౌకర్యాలున్నాయి:
అంతరిక్ష నౌకల కార్యకలాపాలను నిర్వహించడానికి, నియంత్రించడానికి, నెట్‌వర్క్ స్టేషన్‌లతో సమన్వయం చేయడానికీ బెంగుళూరులోని ISTRAC లో TTC గ్రౌండ్ స్టేషన్ (BLR)తో కూడిన పూర్తి రిడెండెన్సీ మల్టీ-మిషన్ స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ కేంద్రం ఉంది. డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్‌తో కూడిన కంప్యూటర్ వ్యవస్థలో సమాచారం కోసం, వివిక్త నౌకలకు చెందిన రియల్ టైమ్ డిస్‌ప్లేలను అందించడానికి, ప్రత్యేకించిన ప్రాసెసర్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ డేటా ఆర్కైవల్, విశ్లేషణ, కక్ష్య నిర్ధారణ కోసం ఆఫ్‌లైన్ ప్రాసెసర్‌లు ఇక్కడ ఏర్పాటు చేసారు.
SCC, ISTRAC నెట్‌వర్క్ స్టేషన్‌లతో పాటు ఇతర బాహ్య అంతరిక్ష ఏజెన్సీల నియంత్రణ కేంద్రాలు, అంకితమైన వాయిస్, డేటా, TTY లింకుల ద్వారా డేటా రిసెప్షన్ స్టేషన్‌ల మధ్య లింకులను ఏర్పాటు చేయడానికి కమ్యూనికేషన్ కంట్రోల్ సదుపాయం ఉంది.
ISRO కు చెందిన భూ నిమ్న కక్ష్య ఉపగ్రహాలన్నిటికీ ట్రాకింగ్, కమాండింగ్, హౌస్‌కీపింగ్ డేటా సేకరణలతో పాటు ఆరోగ్య విశ్లేషణ, నియంత్రణ, కక్ష్య, వైఖరిల నిర్ధారణ, నెట్‌వర్క్ కో-ఆర్డినేషన్ మద్దతు.
ISRO వాహక నౌకల ప్రయోగాలలో లిఫ్ట్‌ఆఫ్ నుండి ఉపగ్రహ ప్రతిక్షేపణ వరకు టెలిమెట్రీ డేటా సేకరణ మద్దతు, ఉపగ్రహ ఇంజెక్షన్ పారామితులను పర్యవేక్షించడానికి, నిర్ణయించడానికి డౌన్ రేంజ్ ట్రాకింగ్ మద్దతు.
అంతరిక్ష నౌక, వాహక నౌకల బృందాల మధ్య సమన్వయం చేయడం, జాతీయ, అంతర్జాతీయ ఉపగ్రహ మిషన్ల కోసం మిషను పూర్తి అయ్యే వరకూ ప్లానింగు నుండి గ్రౌండ్ స్టేషన్‌లకు మద్దతు ఇవ్వడం.
అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ ప్రాజెక్టులకు టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ మద్దతు.