స్థాపన | 1951[1] |
---|---|
వ్యవస్థాపకులు | అబ్దుల్ సత్తార్ ఈది |
కేంద్రీకరణ | అత్యవసర సర్వీసులు, అనాధలు, వికలాంగులు, పునరావాస కేంద్రాలు, విద్య, ఆరోగ్యం, అంతర్జాతీయ సేవా సంస్థలు, బ్లడ్ , రక్త బ్యాంకులు, ఎయిర్ అంబులెన్స్ సర్వీసు, మెరైన్ , కోస్టర్ సర్వీసు. |
కార్యస్థానం | |
సేవా ప్రాంతాలు | Social Welfare, Humanitarianism |
పద్ధతి | విరాళాలు , గ్రాంటులు |
ముఖ్యమైన వ్యక్తులు | అబ్దుల్ సత్తార్ ఈది, co-founder and co-chair Bilquis Edhi |
నినాదం | "Live and help live" [2][3] |
జాలగూడు | edhi.org |
ఈదీ ఫౌండేషన్ పాకిస్తాన్ లోని ఫలాపేక్ష లేని సామాజిక సంక్షేమ సంస్థ. దీనిని అబ్దుల్ సత్తార్ ఈది.[4] 1951 లో స్థాపించాడు. ఆయన 2016 జూలై 8న తన మరణం వరకూ ఆ సంస్థకు అధిపతిగా యున్నాడు,. అతని భార్య, విల్‌క్విస్, ఒక నర్సు పిల్లల దత్తత సర్వీసులను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ లోని కరాచీ నగరం.
ఈ సంస్థ పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 24 గంతలు అత్యవసర సేవలనను అందిస్తుంది. ఈ సంస్థ పునరావాస కేంద్రాలు, ఉచిత వైద్యశాలలు, వైద్య సహాయం, డ్రగ్ రీహాబిటేషన్ సర్వీసులు, జాతీయ, అంతర్జాతీయ అత్యవసర సేవలను అందిస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా అత్యవసర సేవలు, అనాథలు, వికలాంగులైన వారు, పునరావాసం, విద్య, వైద్యం, అంతర్జాతీయ సేవా సంస్థలు, బ్లడ్, డ్రగ్ బ్యాంకులు, ఎయిర్ అంబులెన్స్ సర్వీసులు, మరైన్ అండ్ కోస్టల్ సర్వీసులపై ప్రధాన దృష్టి పెడుతుంది.
ఈదీ 1957లో తన మొదటి సంక్షేమ కేంద్రాన్ని స్థాపించాడు. అది ఈదీ ట్రస్టుగా అప్పటికి ఉండేది.[5] అది ఒక వ్యక్తితో నిర్వహించబడుతూ ఒక గదిలో ప్రారంభించబడి ప్రస్తుతం ఈదీ ఫౌండేషనుగా మారింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 300 కేంద్రాలను స్థాపించింది. ఈ కేంద్రాలు పెద్ద నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నాయి. ఈ కేంద్రాలు వైద్య సహాయం, కుటుంబ నియంత్రణ, అత్యవసర వైద్య సేవలను అందిస్తుంది. వారికి దూర ప్రాంతాలవారికి సేవలందించడానికి స్వంత అంబులెన్సులు, ఉన్నాయి.
కరాచీలో ఈదీ ఫౌండేషన్ 8 ఆసుపత్రులను నెలకొల్పి ఉచిత వైద్య సేవలనందిస్తుంది. వీటిలో ఉచిత వైద్యశాలలు, కంటి ఆసుపత్రులు, డయాబెటిక్ సెంటర్లు, సర్జికల్ యూనిట్లు, నాలుగు పడకల కేన్సర్ ఆసుపత్రి, మొబైల్ వైద్యశాలలు ఉన్నాయి. అదనంగా ఈ సంస్థ బ్లడ్ బ్యాంకులు కరాచీలో నెలకొల్పింది. ఇతర ఈదీ సర్వీసులకు ఉద్యోగులు, వాలంటిర్లు నడుపుతున్నారు. ఈ ఫౌండేషన్ న్యాయ సేవా విభాగాన్ని కలిగి ఉండి ఉచిత సేవలనందిస్తుంది. ఈ విభాగం జైళ్లలో ఉన్న అమాయక పౌరులకు విడుదల చేసేందుకు కృషి చేస్తుంది. జైళ్లలో ఉన్న వారికి కమిషన్ డాక్టర్లు సందర్శించి ఆహారాన్ని యితర సహాయాన్ని అందిస్తుంటారు. ఆ సంస్థకు 15 "అప్నా ఘర్" (మన యిల్లు) గృహాలు మానసిక వికలాంగులకు, తప్పిపోయిన పిల్లలకు సేవలందించడానికి ఉన్నాయి.
ఈ సంస్థ విద్యా పథకాలను, బోధన, పఠనం మరియూ లేఖనం కార్యక్రమాలు, ఒకేషనల్ కార్యక్రామలైన డ్రైవింగ్, ఫార్మసీ అంరియు పారా-మెడికల్ శిక్షణను అందిస్తుంది. ఈదీ ఫౌండేషన్ వివిధ దేశాలలో శాఖలను కలిగియుంది. ఈ సంస్థ యు.ఎస్.ఎ., యు.కె, కెనడా, జపాన్, బంగ్లా దేశ్ లలో ప్రజలకు సహాయాన్నందిస్తుంది. 1991లో గల్ఫ్ యుద్ధం బాదితులకు సహాయాన్నందిస్తుంది. ఇరాన్, ఈజిప్టు దేశాలలో భూకంప బాధితులకు సహాన్నందించింది. ఈ సంస్థ 1997 నుండి " అతి పెద్ద లాలంటీర్ అంబులెన్స్ ఆర్గనైజేషన్"గా గిన్నిస్ రికార్డు పొందింది.[6]