ఈశాన్య రైల్వే

ఈశాన్య రైల్వే
2-ఈశాన్య రైల్వే
ఆపరేషన్ తేదీలు1952–ఇంత వరకు
మునుపటిదిఔధ్ , తిర్హట్ రైల్వే, అస్సాం రైల్వే, కాన్‌పోర్-బారాబంకి రైల్వే , కాన్‌పోర్-అచ్నెర విభాగం
ట్రాక్ గేజ్మిక్స్‌డ్
ప్రధానకార్యాలయంగోరఖ్‌పూర్
జాలగూడు (వెబ్సైట్)North Eastern Railway

నార్త్ ఈస్టర్న్ రైల్వే లేదా ఈశాన్య రైల్వే భారతదేశం పదహారు రైల్వే మండలాలులో ఒకటి. గోరఖ్‌పూర్ దీని ప్రధాన కార్యాలయం , లక్నో , వారణాసి డివిజన్లు ఉన్నాయి. అలాగే ఇజ్జత్‌నగర్ డివిజనును పునఃవ్యవస్థీకరించారు.

నార్త్ ఈస్టర్న్ రైల్వే, రెండు రైల్వే వ్యవస్థలు ఔధ్ , తిర్హట్ రైల్వే , అస్సాం రైల్వే , బాంబే, బరోడా , సెంట్రల్ ఇండియా రైల్వే లోని కాన్‌పోర్-అచ్నెర రైలు మార్గము విభాగం కలపడం ద్వారా 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.

కాన్‌పోర్-బారాబంకి రైల్వే 1953 ఫిబ్రవరి 27 న ఉత్తర తూర్పు రైల్వేకి బదిలీ చేశారు. నార్త్ ఈస్టర్న్ రైల్వే జనవరి 1958 15 న రెండు రైల్వే మండలాలు (జోనులు) గా విభజింపబడింది, ఒకటి నార్త్ ఈస్టర్న్ రైల్వే, రెండోది ఈశాన్య సరిహద్దు రైల్వే , తూర్పు కతిహార్ లోని అన్ని లైన్లు ఈశాన్య సరిహద్దు రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. .[1]

అక్టోబరు 2002 న 1, సమస్తిపూర్ , సోన్‌పూర్ డివిజన్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. ప్రస్తుతం నార్త్ ఈస్టర్న్ రైల్వే, (ఎన్‌ఈఆర్), 2002 లో రైల్వే జోన్ల పునర్వ్యవస్థీకరణ తరువాత, వారణాసి, లక్నో & ఇజత్‌నగర్ అను మూడు డివిజన్లు (విభాగాలు) గా ఉంది.

నార్త్ ఈస్టర్న్ రైల్వే, 486 స్టేషన్లతో 3,402.46 మార్గం కి.మీ. కలిగి ఉంది. నార్త్ ఈస్టర్న్ రైల్వే, ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ & బీహార్ పశ్చిమ జిల్లాలు ప్రాంతాలలో పనిచేస్తుంది.

ఈ రైల్వే గుండా అనేక ముఖ్యమైన పర్యాటక , సాంస్కృతిక కేంద్రాలు వంటివి అయిన వారణాసి, సారనాథ్, లక్నో, అలహాబాద్, కుషినగర్, లుంబిని, అయోధ్య, నైనిటాల్, రాణిఖేట్, కౌసాని , దుధ్వా మొదలైన వాటిని. కలుపుతుంది

ప్రధాన స్టేషన్లు లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, శరణ్ మొదలైనవి. ఇది కూడా కొన్ని స్టేషన్లు శివాన్, గోండా, బస్తీ, ఖలిలాబాద్, బారాబంకి మొదలైనవి వంటివి కలిగి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42-4

బయటి లింకులు

[మార్చు]

మూసలు , వర్గాలు

[మార్చు]