వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | Madhuri Mehta |
జట్టు సమాచారం | |
చరిత్ర | |
IZODC విజయాలు | 0 |
IZ3D విజయాలు | 0 |
IZT20 విజయాలు | 0 |
IZOD విజయాలు | 0 |
ఈస్ట్ జోన్ (తూర్పు మండల) మహిళా క్రికెట్ జట్టు మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు, T20 మ్యాచ్ లు ఆడటానికి ఏర్పాటు చేసారు. ఇది.భారత దేశ తూర్పు ప్రాంతాలకు చెందిన ఐదు జట్లకు చెందిన ఆటగాళ్ల మిశ్రమ జట్టు. అవి - అస్సాం, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర జట్లు. రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఈ తూర్పు మండల జట్టు ఏర్పాటు చేసారు. పోటీలు ముగిసే వరకు అంటే 2002-03 సం.వరకు తూర్పు మండల జట్టు ఆడింది. తర్వాతఆ జట్టు ఒక రోజు పోటీలో, ఆపై మూడు రోజుల పోటీలలో పాల్గొని, రెండుసార్లుగా రన్నరప్‌గా నిలిచారు.[1]
తూర్పు మండల మహిళల జట్టు మొదట రాణి ఝాన్సీ ట్రోఫీని 1974 –75 లిస్ట్ A పోటీలో ఆడారు. 2002-03 తర్వాత సీజన్ రద్దు అయ్యే వరకు వారు టోర్నమెంట్లో ఆడారు, అయితే ఈ ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు.[2] వారు 1975-76, 1984-85 లో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో కూడా మ్యాచ్‌లు ఆడారు.[3][4]
2007లో, ఈ జట్టు ఒక రోజు పోటీలలో 2006-07 మధ్య నుండి 2013-14 సీజన్ ముగిసే వరకు ఆడింది.[2] 2010-11లో నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలతో 3వ స్థానంలో నిలిచింది.[5]
2014–15 సీజన్లో, తూర్పు మండల మహిళల జట్టు అంతర మండల రెండు రోజుల పోటీలో పాల్గొంది. మొదటి సీజన్లో, నాలుగు మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్‌లో గెలిచిన రెండు ఆటలు డ్రా అవడంతో రన్నరప్‌గా నిలిచింది.[6] టోర్నమెంట్ మూడు రోజుల పోటీగా మారినప్పుడు, మొదటి ఇన్నింగ్స్‌లో ఆటలు మూడు డ్రా అవడంతో 2015–16లో జట్టు మళ్ళీ రన్నరప్‌గా నిలిచింది.[7] 2016–17లో తూర్పు మండల జట్టు నాల్గవ స్థానంలోను, 2017–18లో ఐదు జట్ల పోటీలో అట్టడుగు స్థానం సంపాదించింది.[8][9]
2022–23లో, మహిళల అంతర మండల T20 క్రికెట్ పోటీలతో భారతదేశంలో జోనల్ క్రికెట్ తిరిగి వచ్చింది. ఆరు జట్ల టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.[10] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల అంతర మండల ఒక రోజు పోటీలలో సమూహ (గ్రూప్) దశలో మూడవ స్థానంలో నిలిచింది.[11]
2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ టోపీ (క్యాప్)లు ఉంటాయి.[12][13]
సీజన్లు | లీగ్ స్టాండింగ్‌లు [14] | గమనికలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | DWF | DLF | ND | BP | Pts | Pos | ||
2014–15 | 4 | 0 | 0 | 2 | 1 | 1 | 0 | 8 | 2వ | |
2015–16 | 4 | 0 | 0 | 3 | 1 | 0 | 0 | 10 | 2వ | |
2016–17 | 4 | 0 | 1 | 2 | 1 | 0 | 0 | 7 | 4వ | |
2017–18 | 4 | 0 | 1 | 1 | 2 | 0 | 0 | 5 | 5వ |
సీజన్లు | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 1 | 4 | 0 | 0 | +0.257 | 4 | 5వ |
సీజన్లు | లీగ్ స్టాండింగ్‌లు | గమనికలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
P | W | L | T | NR | NRR | Pts | Pos | ||
2022–23 | 5 | 3 | 2 | 0 | 0 | +0.362 | 12 | 3వ |