Uttam Yudh Seva Medal | |
---|---|
![]() Medal | |
Type | Military decorations |
Awarded for | Wartime distinguished service |
దేశం | ![]() |
అందజేసినవారు | Government of India |
![]() Ribbon | |
Precedence | |
Next (higher) | ![]() |
Equivalent | ![]() |
Next (lower) | ![]() |
ఉత్తమ యుద్ధ సేవా మెడల్ | |
---|---|
![]() పతకం | |
Type | సైనిక పతకాలు |
Awarded for | యుద్ధసమయంలో ప్రదర్శించే విశిష్టమైన సేవకు |
దేశం | ![]() |
అందజేసినవారు | భారత ప్రభుత్వం |
![]() రిబ్బను | |
Precedence | |
Next (higher) | ![]() |
Equivalent | ![]() |
Next (lower) | ![]() |
ఉత్తమ్ యుద్ధ సేవా పతకం (UYSM) యుద్ధసమయంలో విశిష్ట సేవ కోసం భారతదేశంలో ఇచ్చే సైనిక పతకాలలో ఒకటి. ఇది ఆపరేషన్ల సందర్భంలో అధిక స్థాయి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇస్తారు. యుద్ధం, సంఘర్షణ, ఘర్షణల సమయాలను "ఆపరేషన్ల సందర్భం" అంటారు. ఈ పతకం, శాంతికాల విశిష్ట సేవా పతకమైన అతి విశిష్ట సేవా పతకానికి సమానమైనది. ఉత్తమ యుద్ధ సేవా పతకాన్ని మరణానంతరం ఇవ్వవచ్చు.[2]
ఈ పతకాన్ని యుద్ధం/సంఘర్షణ/శత్రుత్వాల సమయంలో అసాధారణమైన స్థాయి లోని విశిష్ట సేవకు ఇస్తారు. ఇది టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లు, ఆక్సిలరీ, రిజర్వ్ దళాలు, ఇతర చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన సాయుధ దళాలతో సహా ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లోని అన్ని ర్యాంకులకు, అలాగే సాయుధ దళాల లోని నర్సింగ్ అధికారులు, నర్సింగ్ సేవలలోని ఇతర సభ్యులకూ ఇవ్వవచ్చు.[3]
పతకం వృత్తాకారంలో, 35 మి.మీ. వ్యాసంతో ఉంటుంది. ప్రామాణిక ఫిట్టింగ్‌లతో సాదా అడ్డంగా ఉండే పట్టీకి అమర్చబడి ఉంటుంది. ఈ బంగారు గిల్ట్ పతకానికి ముందువైపున జాతీయ చిహ్నం, హిందీ ఆంగ్లంలో శాసనాలు ఉన్నాయి. వెనుకవైపున, ఐదు కోణాల నక్షత్రం ఉంటుంది. రిబ్యాండ్ బంగారు రంగులో రెండు ఎరుపు నిలువు గీతలతో మూడు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది.
పతకం గ్రహీతకు మళ్లీ ఈ పతకాన్ని ప్రదానం చేసినట్లయితే, అటువంటి ప్రతి అవార్డును పతకాన్ని రిబ్యాండ్‌కు జోడించబడే పట్టీ ద్వారా సూచిస్తారు. అటువంటి ప్రతి బార్‌కు, ప్రభుత్వం ఆమోదించిన సూక్ష్మ నమూనాను రిబ్యాండ్‌కు జోడించాలి. [4]