ఉత్తమ విలన్ | |
---|---|
దర్శకత్వం | రమేష్ అరవింద్ |
రచన | కమల్ హాసన్ (స్క్రీన్ ప్లే, సంభాషణలు , కథ) |
నిర్మాత | కమల్ హాసన్ ఎన్. లింగుసామి |
తారాగణం | కమల్ హాసన్ జయరాం కె. బాలచందర్ ఆండ్రియా జెరేమిమా పూజా కుమార్ పార్వతి పార్వతీ నాయర్ |
ఛాయాగ్రహణం | శ్యాం దత్ |
కూర్పు | విజయ్ శంకర్ |
సంగీతం | ఎం. ఝిబ్రాన్ |
నిర్మాణ సంస్థలు | తిరుపతు బ్రదర్స్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | ఈరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | మే 1, 2015[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఉత్తమ విలన్ 2015 లో విడుదలకు సిద్దమవుతున్న భారతీయ బహుభాషా చిత్రం. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను అందించి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాధ్, బాలచందర్ కూడా ఇందులో పాత్రలు పోషించారు.
మనోరంజన్ (కమల్ హాసన్) ఓ సినిమా స్టార్. వయసు మీదపడినా... తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో ఆడుతూ పాడుతూ... కమర్షియల్ హీరోగా కెరీర్ నెట్టుకొచ్చేస్తుంటాడు. తన కెరీర్ కు పునాది వేసిన మార్గదర్శి (కె.బాలచందర్) ని కాదని, స్టార్ హీరోగా నిలబడటం కోసం సినీ నిర్మాత పూర్ణచంద్రరావు (కె.విశ్వనాథ్)ను ఆశ్రయిస్తాడు. ఆయన గారు... మనోరంజన్ కెరీర్ నే కాకుండా జీవితాన్ని కూడా తన చెప్పుచేతల్లోకి తీసుకుని తన కూతురు వరలక్ష్మి (ఊర్వశి )ని మనోరంజన్‌కు ఇచ్చి వివాహం చేస్తాడు. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో సాగిపోతున్న సమయంలో గతంలో తను ప్రేమించిన వ్యక్తి ద్వారా తనకో కూతురు కలిగిందనే నిజం మనోరంజన్‌కు తెలుస్తుంది. అదే సమయంలో తనకు క్యాన్సర్ సోకిందని, ఎక్కువ కాలం బ్రతకననే విషయమూ ఫ్యామిలీ డాక్టర్ అర్పణ (ఆండ్రియా) ద్వారా తెలుసుకుంటాడు. అక్కడ నుండి తన జీవితంలో చేసిన తప్పుల్ని సరిచేసుకునే ప్రయత్నం మొదలెడతాడు. ముందుగా తన కెరీర్‌ను తీర్చిదిద్దిన మార్గదర్శిని కలిసి, తనను జీవితాంతం ప్రేక్షకులు గుర్తుంచుకునేలా ఓ కామెడీ సినిమా తీసి పెట్టమని వేడుకుంటాడు. అలా మనోరంజన్, మార్గదర్శి కాంబినేషన్లో 'ఉత్తమ విలన్' చిత్రం మొదలవుతుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఉత్తముడు అనే మృత్యుంజయుడి కథను వీరు ఎంపిక చేసుకుంటారు. ఓ కపటరాజుకు బుద్ధి చెప్పడం కోసం ఉత్తముడు ఏం చేశాడన్నదే ఆ సినిమా కథ. రోజు రోజుకూ మృత్యువుకు చేరువ అవుతున్న హీరో మనోరంజన్... మృత్యుంజయుడైన ఉత్తముడి పాత్ర ద్వారా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలనుకుంటాడు.![2]