ఉత్తర ఉన్ని | |
---|---|
జననం | 1992-10-14 తిరువల్ల, కేరళ, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నర్తకి నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–2018 |
తల్లిదండ్రులు | ఎ ఆర్ ఉన్ని ఊర్మిళ ఉన్ని |
బంధువులు | సంయుక్త వర్మ (కజిన్) |
ఉత్తర ఉన్ని ఒక భారతీయ సినీ నటి.[1] ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. 2012లో సురేష్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా వవ్వల్ పేసంగతో తెరంగేట్రం చేసింది ఉత్తర. ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం ఎదవప్పతీ. ఈ సినిమాకు లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని నటనకు ఆమె కేరళ రాష్ట్ర సినీ విమర్శకుల పురస్కారం- ఉత్తమ నూతన నటి అవార్డు గెలుచుకుంది.[2][3] లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఆమె నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.[4][5] ధాత్రి రియల్ స్లిమ్ ఆయిల్ ఎడ్వర్టైజ్మెంట్ లో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఉత్తర, శ్రీ కుమారన్స్, భీమా జ్యుయెలర్స్, ఎమ్మాన్యువల్ సిల్క్స్ వంటి యాడ్ లలో నటించింది.
గాయని అయిన ఉత్తర పతిరపొనెత్రిల్ అనే ఆల్బంను ఇటీవల విడుదల చేసింది.[6] బహ్రయిన్లో అంగొపంగా అనే నృత్య పాఠశాల స్థాపించింది ఉత్తర.[7] ఆమె ప్రపంచ ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి కూడా. యునెస్కో ప్రపంచ నాట్య కౌన్సిల్ లో ఉత్తర సభ్యురాలు. బహ్రయిన్ తో పాటు ముంబైలోని టెంపుల్ స్టెప్స్ లో కూడా ఆమె నాట్య పాఠశాలలు ఉన్నాయి.[8] ఆమె దర్శకత్వం వహించిన రండాం వరవు అనే లఘుచిత్రానికి 5 ఉత్తమ దర్శకురాలు పురస్కారాలు లభించాయి.