ఉత్సవ్ | |
---|---|
దర్శకత్వం | గిరీష్ కర్నాడ్ |
రచన | కృష్ణ బస్రూర్, గిరీష్ కర్నాడ్ (స్క్రీన్ ప్లే) శరద్ జోషి(డైలాగ్) |
నిర్మాత | శశి కపూర్ |
తారాగణం | శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ |
Narrated by | అమ్జద్ ఖాన్ |
ఛాయాగ్రహణం | అశోక్ మోహతా |
కూర్పు | భానుదాసు దివాకర్ |
సంగీతం | లక్ష్మీకాంత్-ప్యారేలాల్, వసంత్ దేవ్ (పాటలు) |
విడుదల తేదీ | 21 డిసెంబరు 1984 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఉత్సవ్ 1984లో విడుదలైన హిందీ చలనచిత్రం. సా.శ. 2వ శతాబ్దంలో శూద్రకుడు సంస్కృతంలో రాసిన మృచ్ఛకటికమ్ నాటకం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించాడు.[1][2] శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
శూద్రకుడు ఒక రాజు. ఇతడు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం, సా.శ. ఐదవ శతాబ్దం మధ్య కొంతకాలం జీవించినట్లు భావిస్తారు.[3] క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం మొదటి త్రైమాసికంలో ప్రడియోటా రాజవంశం చివరి పాలక రాజు పాలనలో పురాతన నగరమైన ఉజ్జయినిలో జరిగిన ఇతివృత్తం (వసంతసేన (రేఖ) ఉజ్జయినిలో ఒక పేద బ్రాహ్మణ వ్యక్తైన చారుదత్తా (శేఖర్ సుమన్) తో కలిసే అవకాశం) ఆధారంగా మృచ్ఛకటికమ్ నాటకం రాయబడింది.[4]