ఉదయ్ సమంత్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రత్నగిరి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఉన్నత, సాంకేతిక విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]
- 2004: మహారాష్ట్ర శాసనసభకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2009: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2013 - 2014: మహారాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి [2]
- 2013 - 2014: రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రి [3]
- 2014: మహారాష్ట్ర శాసనసభకు .3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2017 : పూణే నగర సంపర్క్ ప్రముఖ్‌గా నియమితులయ్యాడు [4]
- 2018 : శివసేన పార్టీ ఉప నాయకుడిగా నియమితులయ్యాడు [5]
- 2018 : మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (Mhada) [6][7] చైర్మన్‌గా నియమితులయ్యాడు.
- 2019: మహారాష్ట్ర శాసనసభకు 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక [8]
- 2019: ఉన్నత, సాంకేతిక విద్య మంత్రిగా నియమితులయ్యాడు [9][10]
- 2020: సింధుదుర్గ్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు [11]
- 2024: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 2024 డిసెంబర్ 15: పరిశ్రమల, మరాఠీ భాషా మంత్రి[12][13][14]