ఉప్పల్
ఉప్పల్ కమాన్ | |
---|---|
Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | ఉప్పల్ |
Elevation | 455 మీ (1,493 అ.) |
భాష | |
• అధికారక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 039 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 91 040 |
Vehicle registration | TS-08 |
ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం,[1]
ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,84,835 - పురుషులు 1,95,649 - స్త్రీలు 1,89,186.పిన్ కొడ్:500039.
ఉప్పల్ కలాన్, ఉప్పల్ ఖల్సా, ఉప్పల్ బాగాయత్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషను కూడా ఉంది.
ఉప్పల్ జంక్షన్ లో రూ. 450 కోట్లతో ఏర్పాటచేసిన ఫ్లైఓవర్ థీమ్ పార్క్ ను 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2][3][4]
అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కైవాక్ నిర్మించబడుతోంది.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)