అందాల పోటీల విజేత | |
![]() ఉషోషి సేన్‌గుప్తా | |
జననము | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1988 జూలై 30
---|---|
ఎత్తు | 1.71 మీ. (5 అ. 7+1⁄2 అం.)[1] |
జుత్తు రంగు | నలుపు |
కళ్ళ రంగు | గోధుమ రంగు |
బిరుదు (లు) | ఐ యామ్ షీ 2010 |
ప్రధానమైన పోటీ (లు) | ఐ యామ్ షీ 2010 (విజేత) మిస్ యూనివర్స్ 2010 (అన్ ప్లేస్డ్) |
ఉషోషి సేన్‌గుప్తా (జననం 1988 జూలై 30) భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఐ యామ్ షీ-మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2010 ఆగస్టు 23న మాండలాయ్ బే, లాస్ వెగాస్, నెవాడాలో జరిగిన మిస్ యూనివర్స్ 2010 పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2][3]
కోల్‌కాతాలో జన్మించిన ఉషోషి సేన్‌గుప్తా భారత వైమానిక దళంలో ఒక అధికారి కుమార్తె.[4] ఆమె బాలిగంజ్ లోని కేంద్రీయ విద్యాలయ నుండి పట్టభద్రురాలైంది, అక్కడ ఆమె గణితంలో రాణించింది. దీంతో ఇంజనీరింగ్ కళాశాలకు స్కాలర్షిప్ అందించబడింది, కానీ ప్రొఫెషనల్ మోడలింగ్ ను కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి హ్యుమానిటీస్ తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మిస్ యూనివర్స్ ఇండియా కావడానికి ముందు మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది.[5] ఆమె బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఎగోలెర్ చోఖ్ (2016) చిత్రంతో అడుగు పెట్టింది, దీనికి అరిండం సిల్ దర్శకత్వం వహించాడు.[6]
సంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు | సహ-తారాగణం | గమనిక |
---|---|---|---|---|---|
2012 | హౌస్ఫుల్ 2: ది డర్టీ డజన్ | హిందీ | సాజిద్ ఖాన్ | అక్షయ్ కుమార్, అసిన్, జాన్ అబ్రహం, రితేష్ దేశ్ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ | అతిధి పాత్ర |
2013 | గుడ్బైడిసెంబర్ | మలయాళం | సాజీద్ ఎ. | నందిని రాయ్ | |
2016 | ఈగోలర్ చోఖ్ | బెంగాలీ | అరిందమ్ సిల్ | శాశ్వత్ ఛటర్జీ, జోయా అహ్సాన్, పాయెల్ సర్కార్, అనిర్బన్ భట్టాచార్య, గౌరవ్ చక్రవర్తి, అరుణిమా ఘోష్, జూన్ మాలియా | శ్యామంగి |
మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ సహకారంతో తంత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన జాతీయ పోటీ అయిన ఐ యామ్ షీ-మిస్ యూనివర్స్ ఇండియా మొదటి ఎడిషన్ను ఉషోషి గెలుచుకుంది. 2010 ఆగస్టు 23న లాస్ వెగాస్, నెవాడాలో జరిగిన 2010 మిస్ యూనివర్స్ పోటీకి భారతదేశం అధికారిక ప్రతినిధిగా పోటీ పడి 83 మంది ప్రతినిధులలో ఒకరిగా నిలిచింది.