వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఉస్మాన్ సలాహుద్దీన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 2 డిసెంబరు 1990|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 232) | 2018 జూన్ 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 184) | 2011 మే 2 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 మే 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2007/08–2012/13 | లాహోర్ షాలిమార్ | |||||||||||||||||||||||||||||||||||
2014/15 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||
2015/16–2018/19 | లాహోర్ వైట్స్ | |||||||||||||||||||||||||||||||||||
2016/17 | నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||
2019–present | సెంట్రల్ పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2018 జూన్ 3 |
ఉస్మాన్ సలాహుద్దీన్ (జననం 1990, డిసెంబరు 2) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్.[1] 2011 మే సిరీస్ కోసం వెస్టిండీస్‌తో ఆడేందుకు ఎంపికయ్యాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో సలావుద్దీన్ సగటు 36, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 47గా ఉంది. ఫైసల్ బ్యాంక్ టీ20 కప్ 2012–13 సీజన్‌లో లాహోర్ ఈగల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[2]
2016 సీజన్ న్యూకాజిల్ సిటీ క్రికెట్ క్లబ్ వారి ప్రోగా సంతకం చేసాడు. 2017 ఏప్రిల్ లో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు, కానీ ఆడలేదు. 2017 సెప్టెంబరు, అక్టోబరులో శ్రీలంకతో ఆడిన టెస్ట్ సిరీస్ కోసం తన స్థానాన్ని తిరిగి పొందాడు, కానీ మళ్ళీ ఆడలేదు.[3]
2018 ఏప్రిల్ లో, 2018 మే లో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[4] 2018 జూన్ 1న ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు.[5] 2018 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[6][7]
2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[8][9] 2020 డిసెంబరులో, 2020–21 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ సమయంలో, సలావుద్దీన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అజేయంగా 219 పరుగులతో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.[10] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[11][12] 2021 అక్టోబరులో, శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[13]