ఊపిరి | |
---|---|
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
రచన | అబ్బూరి రవి |
స్క్రీన్ ప్లే | వంశీ పైడిపల్లి |
నిర్మాత | ప్రసాద్ వి. పొట్లూరి |
తారాగణం | కార్తి,అక్కినేని నాగార్జున, తమన్నా |
ఛాయాగ్రహణం | పి. ఎస్. వినోద్ |
కూర్పు | మధు కె.ఎల్. ప్రవీణ్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | పివిపి సినిమా |
విడుదల తేదీ | మార్చి 25, 2016 |
సినిమా నిడివి | 158 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళం |
బడ్జెట్ | ₹65 crore (US$8.1 million) [1] |
బాక్సాఫీసు | ₹80 crore (US$10 million) [2] (7 days collections) |
ఊపిరి 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.
కాళ్ళూ చేతులూ చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ కోటీశ్వరుడు. జైలు నుండి పెరోల్‌పై బయటకొచ్చి, ఇంట్లోవాళ్ళ చేత తిరస్కరించబడి, తప్పని పరిస్థితుల్లో ఆ కోటీశ్వరుడి దగ్గర పనిలో చేరే ఓ యువకుడు. కోట్ల మధ్య ఊపిరి సలపకుండా ఉండే ఆ కోటీశ్వరుడు, ఈ కుర్రాడి కారణంగా తాజా శ్వాసను ఎలా వీల్చుకున్నాడు? డబ్బుంటే చాలు సమస్యలుండవని భావించిన ఈ కుర్రాడు, ఆ కోటీశ్వరుడిని దగ్గరగా చూసి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది కథా సారాంశం.[3]
ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బేబీ ఆగొద్దు" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | శంకర్ మహదేవన్ | 2:39 |
2. | "ఒక లైఫ్" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | కార్తిక్ | 4:46 |
3. | "అయ్యో అయ్యో" | రామజోగయ్య శాస్త్రి | రంజిత్, సుచిత్ర | 3:48 |
4. | "నువ్వేమిచ్చావో" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | విజయ్ ప్రకాష్ | 2:07 |
5. | "పోదాం" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | హరిచరణ్ | 4:45 |
6. | "డోర్ నంబర్ ఒకటి" | రామజోగయ్య శాస్త్రి | గీతా మాధురి | 4:05 |
7. | "ఎప్పుడు" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | కార్తిక్ | 4:47 |
మొత్తం నిడివి: | 27:36 |
2016 సైమా అవార్డులు (తెలుగు)