ఎ.భీమ్‌సింగ్ | |
---|---|
![]() | |
జననం | రాయలచెరువు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా | 1924 అక్టోబరు 15
మరణం | 1978 జనవరి 16 | (వయసు: 53)
వృత్తి | ఎడిటర్, రచయిత, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1949–1978 |
జీవిత భాగస్వామి | సోనా (1949–1978) సుకుమారి (1959–1978) |
పిల్లలు | బి.లెనిన్ బి.కన్నన్ సురేశ్ సింగ్ |
ఎ. భీమ్‌సింగ్(1924-1978) ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు పనిచేశాడు. తమిళ భాషతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషాచిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు.
ఇతడు కృష్ణన్ సోదరి సోనాని 1949లో వివాహం చేసుకున్నాడు. వీరికి 8 మంది సంతానం. వారిలో బి.లెనిన్ అనే కుమారుడు ఎడిటర్‌గా, బి.కన్నన్ అనే కుమారుడు ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు నరేన్ పంజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. భీమ్‌సింగ్ 1959లో చలన చిత్రనటి సుకుమారిని కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.
భీమ్‌సింగ్ తన వెండితెర జీవితాన్ని మొదట 1940ల చివరి భాగంలో కృష్ణన్ - పంజుల వద్ద అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రారంభించాడు. తరువాత సహాయ దర్శకుడిగా కొంత కాలం పనిచేసి దర్శకుడిగా ఎదిగాడు. ఇతడు తీసిన తమిళ సినిమాలద్వారా ఐదు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాడు.
ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు సినిమాలు: