ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్ (1892-1953) [1] భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆయన తన 18 వ యేట పాచైయప్పా కాలేజీ నుండి ఎం.ఎ డిగ్రీని పొందారు. ఆపై ఆయన అదే కాలేజీలో గణిత శాస్త్రాన్ని బోధించారు. 1918 లో ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగంలో చేరారు. ఆయన 1947 లో పదవీవిరమణ చేశారు. 1953 లో ఆయన మరణించారు. ఆయన తండ్రి కన్నడ భాషయందు ప్రముఖమైన కవి. ఆయన తండ్రి పేరు ఎ.కె.రామానుజన్.
అయ్యంగార్ చక్రవాల పద్ధతి పై వ్యాసాన్ని వ్రాసారు. ఆయన ఈ పద్ధతి అవిచ్ఛిన్న భిన్నముల యొక్క పద్ధతికి ఏవిధంగా వైవిధ్యంగా ఉన్నదో నిరూపించారు. ఆయన ఆండ్రీ వైల్ విస్మరించిన విషయాలను గుర్తుకు తెచ్చాడు. ఆండ్రీ వైల్ అనే గణిత శాస్త్రవేత్త ఫెర్మాట్, లెగ్రాంజ్ సిద్ధాంతాలకు ప్రయోగాత్మక వివరణ నిచ్చే ఒకేఒక పద్ధతి చక్రవాల పద్ధతి అని ఆలోచించేవాడు. ఆయన ఆలోచనలలోని విస్మరించిన విషయాలను కృష్ణస్వామి తెలియజేశాడు[2]
బాటన్ రోగ్ లోని లూసియానా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సుభాష్ కక్ అయ్యంగార్ యొక్క గణిత రచనలు విలక్షణమైనవని తెలియజేసాడు.శాస్త్రీయ సమాజంలో ఆయన రచనలు విలక్షనమైనవని తెలిపారు.[3][4]