ఎ.ఎస్. రావు నగర్
డా. ఎ.ఎస్. రావు నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°28′23″N 78°33′59″E / 17.47306°N 78.56639°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Named for | డాక్టర్ అయ్యగారి సాంబశివరావు (డాక్టర్ ఎ.ఎస్.రావు) |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
Elevation | 543 మీ (1,781 అ.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500062 |
Vehicle registration | టిఎస్-08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పట్టణ ప్రణాళిక సంస్థ | హెచ్ఎండిఏ |
ఎ.ఎస్. రావు నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతం. నగరానికి ఈశాన్యం వైపున ఉన్న ఈ ప్రాంతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలో 2వ వార్డు నంబరుగా ఉంది.[1]
2012లో ఈ ఏరియాలో అద్దె ధరలు బాగా పెరిగాయి.[2] ఇది నేరెడ్‌మెట్, ఇసిఐఎల్, సైనిక్‌పురి, మౌలాలీలతో మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉండి, అనేక టౌన్‌షిప్‌లను కలిగి ఉంది.[3]
హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐఎల్) వ్యవస్థాపకుడు డాక్టర్ అయ్యగారి సాంబశివరావు (డాక్టర్ ఎ.ఎస్.రావు) పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఎ.ఎస్. రావు నగర్ అని పేరు పెట్టారు. అటామిక్ ఎనర్జీ, ఇసిఐఎల్, ఎన్‌ఎఫ్‌సి, టిఎఫ్‌ఆర్ విభాగాల ఉద్యోగుల ప్రయోజనాల కోసం 1976లో ఇసిఐఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో ఎ.ఎస్. రావు ముఖ్యపాత్ర పోషించాడు.
ఇక్కడ రిటైల్ దుకాణాలు, వాణిజ్య భవనాలు ఉన్నాయి.[4]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎ.ఎస్. రావు నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను, మౌలాలీ రైల్వే స్టేషనులు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఘటకేసర్, ఇసిఐఎల్, నేరెడ్‌మెట్, కీసర, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు రవాణా పరంగా కలుపబడి ఉంటుంది.