ఎం. సరోజ | |
---|---|
జననం | 1933 మయిలాడుదురు |
మరణం | 2012 ఏప్రిల్ 02 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, కామెడియన్ |
జీవిత భాగస్వామి | కె. ఎ. తంగవేలు
(m. 1959; died 1994) |
పిల్లలు | సుమతి (b. 1961) |
ఎం. సరోజ (1933 - 2012 ఏప్రిల్ 2) తమిళ సినిమా రంగానికి చెందిన భారతీయ నటి. హాస్యనటిగా ఆమె తరచుగా కె. ఎ. తంగవేలుతో జత కట్టేది.[1]
1960లో, చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన తెలుగు సినిమా మా బాబులో ఆమె నటించింది.[2]
దర్శకుడు కె. సుబ్రమణ్యం సరోజను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు, ఆమె 14 సంవత్సరాల వయస్సులో సర్వాధికారి (1951) చిత్రంలో ప్రముఖ నటుడు ఎం. జి. రామచంద్రన్ కజిన్ పాత్రతో అరంగేట్రం చేసింది. హాలీవుడ్ యాక్షన్ చిత్రమైన ది గాల్లెంట్ బ్లేడ్ (1948) అనుకరణగా తమిళంలో తీసి తెలుగులోకి కూడా అనువదించి విడుదల చేసారు.[3]
ఆ తరువాత, ఆమె తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో 300కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన చిత్రం కళ్యాణ పరిసు, ఇందులో ఆమె తన భర్త కె. ఎ. తంగవేలు సరసన నటించింది.[4][5]
1959లో, కల్యాణ పరిసు 100వ రోజు వేడుకల సందర్భంగా మధురై మురుగన్ ఆలయంలో ఆమె, కె. ఎ. తంగవేలును పెళ్లి చేసుకుంది. వీరికి సుమతి అనే కూతురు ఉంది. ఆయన 1994లో మరణించాడు.[4][5]
తమిళనాడు ప్రభుత్వం ఆమెను కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఆమె 2002లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం - శివాజీ గణేశన్ అవార్డును కూడా గెలుచుకుంది.
ఆమె చెన్నైలోని టి. నగర్‌లో తన ఇంటిలో గుండెపోటు కారణంగా 2012 ఏప్రిల్ 2న 79 సంవత్సరాల వయస్సులో మరణించింది.