రకం | ఫిల్మ్ స్కూల్ |
---|---|
స్థాపితం | 1945 |
విద్యాసంబంధ affiliations | ది తమిళనాడు డా. జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ |
అధ్యక్షుడు | రాజేష్ |
స్థానం | సి.ఐ.టి. క్యాంపస్, తారామణి, చెన్నై – 600113, తమిళనాడు, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
ఎమ్.జి.ఆర్. గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇది ఆసియాలో మొట్టమొదటి సినిమా, టెలివిజన్ శిక్షణా సంస్థ. 1945లో అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా స్థాపించబడింది. చెన్నైలోని తారామణిలో ఉన్న ఇది భారతదేశంలోని అగ్రగామి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి.[1] దీనిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.[2]
ఇది నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, సౌండ్ ఇంజినీరింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, ఫిల్మ్ ప్రాసెసింగ్ తదితర విభాగాలకు చెందిన ఒక్కో కోర్సులో 14 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
ఇక్కడ అందించే డిప్లొమాలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆమోదించింది, అయితే సర్టిఫికేట్‌లను తమిళనాడు ప్రభుత్వంలోని సాంకేతిక విద్యా శాఖ ప్రదానం చేస్తుంది.[3][4]
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ సెప్టెంబరు 2022లో నటుడు రాజేష్‌ను ఇన్‌స్టిట్యూట్ హెడ్‌గా నియమించాడు.
ఈ సంస్థ 1945లో సెంట్రల్ పాలిటెక్నిక్‌లో భాగంగా అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా స్థాపించబడింది. 1965లో, ఇది మద్రాస్(చెన్నై)లోని తారామణి ప్రాంతంలో ప్రస్తుత క్యాంపస్‌లోకి మారింది. ఆ సమయంలో, క్యాంపస్ 54 ఎకరాలలో విస్తరించి ఉండగా ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా తగ్గింది. మద్రాస్‌లోని ఐఐటీకి, అనేక ఐటీ కంపెనీలకు భూములు కేటాయించడంతో ఇప్పుడున్న 10 ఎకరాలకు మిగిలింది.
దేశంలోనే పూర్తి స్థాయి ఫిల్మ్ సిటీని 1994 ఆగస్టు 31న అప్పటి ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత ప్రారంభించింది. ఫిల్మ్ సిటీ దాని 21 కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాలతో సినిమా నిర్మాణంనకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి.
ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ తారామణిలో ఉంది. ఇది సమాచారం, ప్రజా సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న భారతీయ చలనచిత్రం, టీవీ శిక్షణా సంస్థ. దీనికి కొంత కాలం జయలలిత ఫిల్మ్ సిటీ అని పేరు పెట్టారు. ఆ తరువాత 2006లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎం. జి. రామచంద్రన్ పేరు మీదుగా దీనికి ఎం.జి.ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గా నామకరణం చేసారు.[5] 1994లో, నగరంలో మరిన్ని సినిమా నిర్మాణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంజీఆర్ ఫిల్మ్ సిటీని ప్రారంభించింది. 1997 అక్టోబరు 16న క్వీన్ ఎలిజబెత్ II ఎంజీఆర్ ఫిల్మ్ సిటీని సందర్శించింది.[6] 1971లో ఎం.జి.ఆర్ కోరిక మేరకు ప్రారంభమైన యాక్టింగ్ కోర్సు 2002లో నిలిపివేయబడింది.[7] ఈ కోర్సును పునరుద్ధరించాలనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది.[8]
సంవత్సరం | పేరు | విభాగం |
కె. ఎస్. ప్రసాద్ | సినిమాటోగ్రాఫర్ | |
మంకాడ రవివర్మ | సినిమాటోగ్రాఫర్ | |
1968 | అశోక్ కుమార్ | సినిమాటోగ్రాఫర్ |
పి. ఎస్. నివాస్ | సినిమాటోగ్రాఫర్ | |
1972 | కీయార్ | చిత్ర దర్శకుడు |
ఆబవనన్ | చిత్ర దర్శకుడు | |
ఆర్వీ. ఉదయకుమార్ | చిత్ర దర్శకుడు | |
1973 | రజనీకాంత్ | నటుడు |
జి.వి.నారాయణరావు | నటుడు | |
మోహన్ బాబు | నటుడు | |
కె. నటరాజ్ | నటుడు | |
రాంకీ | నటుడు | |
సి. రుద్రయ్య | స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు | |
కె. రాజేశ్వర్ | స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు | |
1974 | జోస్ | నటుడు |
1976 | రాజేంద్ర ప్రసాద్ | నటుడు |
సుజాత విజయ్‌కుమార్ | నిర్మాత | |
చక్రపాణి | నటుడు | |
1977 | సుధాకర్ | నటుడు |
చిరంజీవి | నటుడు | |
నాజర్ | నటుడు | |
1978 | శ్రీనివాసన్ | నటుడు |
1979 | పి.సి.శ్రీరామ్ | సినిమాటోగ్రాఫర్ |
1981 | సుహాసిని మణిరత్నం | సినిమాటోగ్రాఫర్ |
1980 | రఘువరన్ | నటుడు |
1983 | అర్చన | నటి |
యుగి సేతు | చిత్ర దర్శకుడు | |
ఆర్. వి. ఉదయకుమార్ | చిత్ర దర్శకుడు | |
1984 | రాజీవ్ మీనన్ | సినిమాటోగ్రాఫర్ |
జి పి కృష్ణ | సినిమాటోగ్రాఫర్ | |
అయనంక బోస్ | సినిమాటోగ్రాఫర్ | |
వి.మణికందన్ | సినిమాటోగ్రాఫర్ | |
బూపతి పాండియన్ | దర్శకుడు | |
శక్తి శరవణన్ | సినిమాటోగ్రాఫర్ | |
1986 | ఆనందరాజ్ | నటుడు |
శివ రాజ్‌కుమార్ | నటుడు | |
ఎస్. శరవణన్ | సినిమాటోగ్రాఫర్ | |
ఎం. వి. పన్నీర్ సెల్వం | సినిమాటోగ్రాఫర్ | |
1987 | రవీంద్రన్ | నటుడు |
కుమార్ బంగారప్ప | నటుడు | |
అజయన్ | సినిమాటోగ్రాఫర్ | |
ఎన్ హరికుమార్ | సౌండ్ ఎడిటర్ | |
యు.కె.సెంథిల్ కుమార్ | సినిమాటోగ్రాఫర్ | |
జీవా | సినిమాటోగ్రాఫర్ | |
ఎస్. శరవణన్ | సినిమాటోగ్రాఫర్ | |
ఎం. వి. పన్నీర్ సెల్వం | సినిమాటోగ్రాఫర్ | |
ఎస్.డి. విజయ్ మిల్టన్ | సినిమాటోగ్రాఫర్ | |
ఆర్. రత్నవేలు | సినిమాటోగ్రాఫర్ | |
1990 | శరవణన్ | నటుడు |
1993 | ఇ. ఎజిల్బాబు | సినిమాటోగ్రాఫర్, కెమెరామెన్, ఇస్రో, అహ్మదాబాద్ |
ఆల్బర్ట్ ఆంటోని | చిత్ర దర్శకుడు | |
వైది ఎస్. | సినిమాటోగ్రాఫర్ | |
ఆర్. దివాకరన్ | సినిమాటోగ్రాఫర్ | |
పి.వి. సునీల్‌కుమార్ | సినిమాటోగ్రాఫర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో | |
1996 | చంద్రు మాణికవాసగం | రచయిత, సినిమా దర్శకుడు |
ఆర్. టి. నీసన్ | దర్శకుడు | |
1997 | ఎన్. కె. ఏకాంబరం | సినిమాటోగ్రాఫర్ |
1998 | జె. శివకుమార్ | దర్శకుడు |
వెట్రి | సినిమాటోగ్రాఫర్ | |
నందా దురైరాజ్ | నటుడు | |
1999 | మోహన్ రాజా | చిత్ర దర్శకుడు |
బొమ్మరిల్లు భాస్కర్ | చిత్ర దర్శకుడు | |
అళగం పెరుమాళ్ | దర్శకుడు, నటుడు | |
పి. ఎస్. వినోద్ | సినిమాటోగ్రాఫర్ | |
అరివళగన్ వెంకటాచలం | దర్శకుడు | |
ఎం. అన్బళగన్ | దర్శకుడు | |
2000 | నరైన్ | సినిమాటోగ్రాఫర్ |
ఇ.కృష్ణసామి | సినిమాటోగ్రాఫర్ | |
2001 | మనోజ్ పరమహంస | సినిమాటోగ్రాఫర్ |
2002 | జ్ఞానం సుబ్రమణియన్ | సినిమాటోగ్రాఫర్ |
2004 | అరుళ్ శక్తి జయం | నీటి అడుగున DOP/ సినిమాటోగ్రాఫర్ |
2005 | మహేష్ నారాయణన్ | సినిమా ఎడిటర్, స్క్రీన్ ప్లే రైటర్ |
మనుష్ నందన్ | సినిమాటోగ్రాఫర్ | |
2006 | విష్ణు గోవింద్ | సౌండ్ ఇంజనీర్, సౌండ్ డిజైనర్ |
విజయ్ ఉలగనాథ్ | సినిమాటోగ్రాఫర్ | |
2008 | దినేష్ కృష్ణన్ | సినిమాటోగ్రాఫర్ |
2009 | సుజిత్ సారంగ్ | సినిమాటోగ్రాఫర్ |
2011 | రిచర్డ్ ప్రసాద్ | సినిమాటోగ్రాఫర్ |
శ్రీహరి | నటుడు | |
బక్కియరాజ్ కన్నన్ | దర్శకుడు | |
2012 | గోపీ కృష్ణ | ఎడిటర్ |
2014 | జె. ధర్మేంద్ర | టెలివిజన్ ప్రెజెంటర్, నటుడు |
2016 | కవిన్ రాజ్ | సినిమాటోగ్రాఫర్ |
2019 | సూర్య ప్రధమన్ | ఎడిటర్ |