ఎక్స్‌ప్రెషనిజం (భావవ్యక్తీకరణవాదం) అనేది నాటకంలో ఉపయోగించే ఒక ప్రక్రియ. అస్పష్టత, క్లిష్టత, ప్రతీకలమయం పోలికలులేని వాటి మధ్య పోలికలు తెచ్చి దిగ్ర్భాంతిని తీవ్రభావావేశాన్ని కలిగించడాన్ని ఎక్స్‌ప్రెషనిజం అంటారు.[1] మామూలుగా ఉండే సహజమైన ఎక్స్‌ప్రెషన్స్ కన్నా అదనంగా, అతిగా, ఆశ్చర్యకరమైన ఎక్స్‌ప్రెషన్స్ తో దిగ్భ్రాంతికరమైన భావాలను పలికించడం, విషయాన్ని ఎగ్జాగ్జరేట్ చేసి చూపించడం, అతిశయోకక్తులను ప్రదర్శించడం, పారడీ చేయడం, హేళన వ్యక్తీకరించడం, విమర్శ ప్రస్పుటంగా చూపడం మొదలైన అతివాద ధోరణులను చూపించడానికి, విషయ తీవ్రతను ఎక్కువగా తెలపడానికి చేసే ప్రయత్నమే ఈ ఎక్స్‌ప్రెషనిజం.
ఎక్స్‌ప్రెషనిజం అనే పదాన్ని తొలిసారిగా 1901లో ఫ్రెంచి చిత్రకారుడైన జులీన్ ఆగస్టు హెర్వే చిత్రలేఖనంలో ఉపయోగించాడు. 1914లో వాల్టేర్ హసెన్ క్లెవర్ ప్రదర్శించిన ది సన్ అనే నాటకంలో ఈ ఎక్స్‌ప్రెషనిజం విజయవంతమయింది.
ఎక్స్‌ప్రెషనిజం లక్షణాలను ఆర్.ఎస్. ఫ్యూర్నెస్ ఎక్స్‌ప్రెషనిజం అనే గ్రంథంలో ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు.